క్రీడాభూమి

చితక్కొట్టిన యువీ, ధోనీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కటక్, జనవరి 19: భారత జట్టులో సీనియర్ ఆటగాళ్లు మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్ సింగ్ సెంచరీలతో చెలరేగిపోవడంతో, ఇంగ్లాండ్‌తో గురువారం ఇక్కడ జరిగిన రెండో వనే్డలో 15 పరుగుల తేడాతో విజయభేరి మోగించిన టీమిండియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకోగలిగింది. చివరిదైన మూడో వనే్డని నామమాత్రపు పోరుగా మార్చేసింది. 382 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ శతవిధాల ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అతని సెంచరీ వృథాకాగా, ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 366 పరుగులు చేయగలిగింది.
టాస్ గెలిచిన మోర్గాన్
ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ కేవలం 14 పరుగుల స్కోరువద్ద లోకేష్ రాహుల్ వికెట్‌ను కోల్పోయింది. అతను ఐదు బంతుల్లో ఐదు పరుగులు చేసి, క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో బెన్ స్టోక్స్ క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. అదే ఓవర్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ కూడా కూలింది. ఐదు బంతులు ఎదుర్కొన్న అతను రెండు ఫోర్లు కొట్టి, బెన్ స్టోక్స్‌కే దొరికిపోయాడు. వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న శిఖర్ ధావన్ మరోసారి చెత్త బ్యాటింగ్‌తో అభిమానులను నిరాశపరిచాడు. 15 బంతులు ఎదుర్కొని, రెండు ఫోర్ల సాయంతో 11 పరుగులు చేసిన అతనిని క్రిస్ వోక్స్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి, కష్టాల ఊబిలో కూరుకుపోయిన టీమిండియాకు మాజీ కెప్టెన్ ధోనీ, సీనియర్ బ్యాట్స్‌మన్ యువీ అండగా నిలిచారు. వీరిద్దరూ ఇంగ్లాండ్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగుల వరద పారించారు. కెరీర్‌లో 295 వనే్డ ఆడిన యువీ 127 బంతులు ఎదుర్కొని, 150 పరుగులు సాధించి, క్రిస్ వోక్స్ బౌలింగ్‌లోనే వికెట్‌కీపర్ జొస్ బట్లర్ క్యాచ్ పట్టగా వెనుదిరిగాడు. 14వ సెంచరీ నమోదు చేసిన అతని స్కోరులో 21 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. ధోనీతో కలిసి నాలుగో వికెట్‌కు అతను 256 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించడంతో భారత్ కోలుకుంది. మొదటి వనే్డలో విరాట్ కోహ్లీతోపాటు సెంచరీ చేసిన కేదార్ జాదవ్ 10 బంతుల్లో 22 పరుగులు చేసి, లియామ్ ప్లంకెట్ బౌలింగ్‌లో జాక్ బాల్ క్యాచ్ పట్టడంతో అవుటయ్యాడు. 48వ ఓవర్ చివరి బంతికి ధోనీ వికెట్ పడింది. అతను 122 బంతుల్లో 134 పరుగులు చేశాడు. ఈ స్కోరులో 21 ఫోర్లు, ఆరు భారీ సిక్సర్లు ఉన్నాయి. ప్లంకెట్ బౌలింగ్‌లోనే డేవిట్ విల్లేకు ధోనీ దొరికిపోయాడు. చివరిలో హార్దిక్ పాండ్య (19), రవీంద్ర జడేజా (16) నాటౌట్‌గా నిలవగా, భారత్ 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 381 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 60 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టాడు. లియామ్ ప్లంకెట్‌కు రెండు వికెట్లు లభించాయి.
బ్యాట్స్‌మెన్ విఫలం
భారత్‌ను ఓడించి, సిరీస్‌ను నిలబెట్టుకోవడానికి 382 పరుగుల భారీ స్కోరు సాధించాల్సి ఉండగా, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (102), జాసన్ రాయ్ (82), జో రూట్ (54), మోయిన్ అలీ (55) తప్ప మిగతా వారు విఫలం కావడంతో ఇంగ్లాండ్‌కు ఓటమి తప్పలేదు. జట్టు స్కోరు 28 పరుగుల వద్ద అలెక్స్ హాలెస్ (14) వికెట్‌ను ఆ జట్టు కోల్పోయింది. జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ధోనీ క్యాచ్ అందుకోగా అతను అవుటయ్యాడు. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన జో రూట్‌తో కలిసి ఓపెనర్ జాసన్ రాయ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 100 పరుగులు జోడించారు. 55 బంతులు ఎదుర్కొని, 8 ఫోర్లతో 54 పరుగులు చేసిన రూట్‌ను కోహ్లీ క్యాచ్ పట్టగా అశ్విన్ అవుట్ చేయడంతో ఇంగ్లాండ్ రెండో వికెట్ కోల్పోయింది. సెకండ్ డౌన్ బ్యాట్స్‌మన్, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌తో కలిసి స్కోరుబోర్డును 150 పరుగుల మైలురాయిని దాటించిన జాసన్ రాయ్ 82 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద రవీంద్ర జడేజా బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. 73 బంతులు ఎదుర్కొన్న అతను తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టాడు. మోర్గాన్ క్రీజ్‌లో నిలదొక్కుకొని ఆడగా, బెన్ స్టోక్స్ (1), జొస్ బట్లర్ (10) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. మోయిన్ అలీ ఆరో వికెట్‌కు మోర్గాన్‌తో కలిసి 93 పరుగులు జోడించాడు. 43 బంతులు ఎదుర్కొని, ఆరు ఫోర్లతో 55 పరుగులు చేసిన అతను భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. క్రిస్ వోక్స్ కేవలం ఐదు పరుగులు చేసి, జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. జట్టును ఆదుకోవడానికి విశ్వ ప్రయత్నం చేసిన ఇయాన్ మోర్గాన్ 81 బంతులు ఎదుర్కొని, ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 102 పరుగులు చేసి రనౌటయ్యాడు. చివరిలో లాథమ్ ప్లంకెట్ (26), డేవిడ్ విల్లే (5) నాటౌట్‌గా నిలవగా, ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 366 పరుగులు చేసింది.

ఇంగ్లాండ్‌పై ఒక వనే్డ ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో ఆరో వాడిగా యువరాజ్ సింగ్ రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. వివియన్ రిచర్డ్స్ 1984 మే 31న మాంచెస్టర్‌లో జరిగిన వనే్డలో అజేయంగా 189 పరుగులు సాధించాడు. 2013 జూన్ 2న సౌతాంప్టన్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గుప్టిల్ కూడా 189 పరుగులతోనే నాటౌట్‌గా నిలిచాడు. 2011 జనవరి 16న మెల్బోర్న్ వనే్డలో ఆస్ట్రేలియా ఆటగాడు షేన్ వాట్సన్ 161 (నాటౌట్) పరుగులు సాధించాడు. 2006 జూలై ఒకటిన లీడ్స్ మైదానంలో శ్రీలంక బ్యాట్స్‌మన్ సనత్ జయసూర్య 152 పరుగులు చేశాడు. 2012 ఆగస్టు 28న సౌతాంప్టన్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు హషీం ఆమ్లా 150 పరుగులు నమోవదు చేశాడు. ఇప్పుడు యువీ కూడా 150 పరుగులతో రాణించాడు.

స్కోరుబోర్డు
భారత్ ఇన్నింగ్స్: లోకేష్ రాహుల్ సి బెన్ స్టోక్స్ బి క్రిస్ వోక్స్ 5, శిఖర్ ధావన్ బి క్రిస్ వోక్స్ 11, విరాట్ కోహ్లీ సి బెన్ స్టోక్స్ బి క్రిస్ వోక్స్ 8, యువరాజ్ సింగ్ సి జొస్ బట్లర్ బి క్రిస్ వోక్స్ 150, మహేంద్ర సింగ్ ధోనీ సి డేవిడ్ విల్లే బి లియామ్ ప్లంకెట్ 134, కేదార్ జాదవ్ సి జాక్ బాల్ బి లియామ్ ప్లంకెట్ 22, హార్దిక్ పాండ్య 19 నాటౌట్, రవీంద్ర జడేజా 16 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 16, మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 381.
వికెట్ల పతనం: 1-14, 2-22, 3-25, 4-281, 5-323, 6-358.
బౌలింగ్: క్రిస్ వోక్స్ 10-3-60-4, డేవిడ్ విల్లే 5-0-32-0, జాక్ బాల్ 10-0-80-0, లియామ్ ప్లంకెట్ 10-1-91-2, బెన్ స్టోక్స్ 9-0-79-0, మోయిన్ అలీ 6-0-33-0.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్: జాసన్ రాయ్ బి రవీంద్ర జడేజా 82, అలెక్స్ హాలెస్ సి ధోనీ బి జస్‌ప్రీత్ బుమ్రా 14, జో రూట్ సి కోహ్లీ బి అశ్విన్ 54, ఇయాన్ మోర్గాన్ రనౌట్ 102, బెన్ స్టోక్స్ బి అశ్విన్ 1, జొస్ బట్లర్ స్టంప్డ్ ధోనీ బి అశ్విన్ 10, మోయిన్ అలీ బి భువనేశ్వర్ కుమార్ 55, క్రిస్ వోక్స్ బి జస్‌ప్రీత్ బుమ్రా 5, లియామ్ ప్లంకెట్ 26 నాటౌట్, డేవిడ్ విల్లే 5 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 12, మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 366.
వికెట్ల పతనం: 1-28, 2-128, 3-170, 4-173, 5-206, 6-299, 7-304, 8-354.
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 10-1-63-1, జస్‌ప్రీత్ బుమ్రా 9-0-81-2, రవీంద్ర జడేజా 10-0-45-1, హార్దిక్ పాండ్య 6-0-60-0, అశ్విన్ 10-0-65-3, రవీంద్ర జడేజా 5-0-45-0.

చిత్రాలు..యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీ