క్రీడాభూమి

సానియా ముందంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల డబుల్స్‌లో చెక్ రిపబ్లిక్‌కు చెందిన బార్బరా స్ట్రయికోస్‌తో కలిసి ఆడుతున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ముందంజ వేసింది. రెండో రౌండ్‌లో సానియా, బార్బరా జోడీ 6-1, 6-4 ఆధిక్యంతో సమంతా స్టొసుర్, షుయ్ జాంగ్ జోడీని ఓడించింది. వీరు తర్వాతి రౌండ్‌లో జపాన్ జోడీ ఎరీ హోజుమీ, మియూ కాటోను ఢీ కొంటారు. కాగా, పురుషుల డబుల్స్‌లో రోహన్ బొపన్నకు చుక్కెదురైంది. ఉరుగ్వే ఆటగాడు పాబ్లో క్యూవాస్‌ను కొత్త భాగస్వామిగా ఎంచుకున్న అతను రెండో రౌండ్‌లో 6-2, 6-7, 4-6 తేడాతో అలెక్స్ బోల్ట్, బ్రాడ్లే మోస్లే జోడీ చేతిలో ఓడాడు.

చిత్రం.. బార్బరా, సానియా