క్రీడాభూమి

‘చౌదరీ’లకు ఊరట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు శుక్రవారం ఇచ్చిన వివరణతో బిసిసిఐ సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరీ, కోశాధికారి అనిరుద్థ్ చౌదరీ ఊరట చెందారు. వీరిద్దరూ బిసిసిఐలో తొమ్మిది సంవత్సరాలు పదవిలో లేని కారణంగా మళ్లీ తమతమ హోదాలను నిలబెట్టుకోనున్నారు. కాగా, ప్రస్తుతం బోర్డులో ఉన్న ఉపాధ్యక్షుల్లో ఎక్కువ సీనియారిటీ ఉన్న సికె ఖన్నాను అధ్యక్ష పదవి వరిస్తుంది. అదే విధంగా కోర్టు తాజా తీర్పు వల్ల బోర్డు జనరల్ మేనేజర్లు రత్నాకర్ శెట్టి (గేమ్ డెవలప్‌మెంట్), ఎంవి శ్రీ్ధర్ (క్రికెట్ ఆపరేషన్స్) తమతమ పదవులను నిలబెట్టుకున్నారు. అయితే, వీరి పరిస్థితి ఈనెల 24 తర్వాతే స్పష్టమవుతుంది. ఆ రోజున లోధా కమిటీ సిఫార్సుల అములు కోసం ముగ్గురు పాలనాధికారులను సుప్రీం కోర్టు నియమిస్తుంది. ఈ త్రిసభ్య కమిటీ బోర్డు వ్యవహారాలను అధ్యయనం చేయడానికి కొంత సమయం తీసుకోవడం ఖాయం. ఆతర్వాతే బోర్డులో ఉద్వాసనకు గురికాగా, మిగిలిన సభ్యులకు వారివారి హోదా, పరిధులు స్పష్టమవుతాయి.