క్రీడాభూమి

వాట్సన్‌కు పగ్గాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జనవరి 30: భారత్‌తో ఆదివారం జరిగే చివరి, మూడో టి-20 మ్యాచ్‌లో పాల్గొనే ఆస్ట్రేలియా జట్టుకు ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ నాయకత్వం వహిస్తాడు. కెప్టెన్ ఆరోన్ ఫించ్ గాయపడడంతో, అతని స్థానంలో వాట్సన్‌కు బాధ్యతలు అప్పగించాలని క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) నిర్ణయించింది. మంగళవారం జరిగిన రెండో మ్యాచ్‌లో ఆడుతున్నప్పుడు ఫించ్ కండరాలు బెణకడంతో ఫిట్నెస్ సమస్యను ఎదుర్కొంటున్నాడు. అతని స్థానంలో జట్టులోకి ఉస్మాన్ ఖాజా వస్తాడని సిఎ ప్రకటించింది. 34 ఏళ్ల వాట్సన్‌కు 51 టి-20 ఇంటర్నేషనల్స్ ఆడిన అనుభవం ఉంది. ఆస్ట్రేలియా తరఫున ఎక్కువ టి-20 మ్యాచ్‌లు ఆడిన వారి జాబితాలో డేవిడ్ వార్నర్ 54 మ్యాచ్‌లతో అగ్రస్థానంలో నిలవగా, 34 ఏళ్ల వాట్సన్‌ది రెండో స్థానం. ఆసీస్‌కు టి-20లో నాయకత్వం వహిస్తున్న తొమ్మిదో ఆటగాడు అతను. గతంలో అతను ఒక టెస్టు మ్యాచ్‌కి, తొమ్మిది వనే్డలకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. తొలిసారి టి-20 ఫార్మెట్‌లో జట్టు పగ్గాలను స్వీకరించనున్నాడు. ఈ ఫార్మెట్‌లో వాట్సన్ 1,191 పరుగులు చేశాడు. 41 వికెట్లు పడగొట్టాడు. డేవిడ్ వార్నర్ (1,465) తర్వాత ఆస్ట్రేలియా తరఫున టి-20 పోటీల్లో ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ అతనే కావడం గమనార్హం.