క్రీడాభూమి

క్వార్టర్స్ చేరిన ఫెదరర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్: కెరీర్‌లో 17 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లు సాధించిన వెటరన్ ఆటగాడు రోజర్ ఫెదరర్ క్వార్టర్స్ చేరాడు. జపాన్ స్టార్ కెయ్ నిషికోరితో జరిగిన మారథాన్ మ్యాచ్‌లో అతను 6-7, 6-4, 6-1, 4-6, 6-3 తేడాతో విజయం సాధించాడు.
సానియా జోడీ ఓటమి
మహిళల డబుల్స్‌లో చెక్ రిపబ్లిక్‌కు చెందిన బార్బరా స్ట్రయికోవాతో కలిసి ఆడిన భారత స్టార్ సానియా మీర్జా మూడో రౌండ్‌లోనే ఓటమిపాలై నిష్క్రమించింది. సానియా, బార్బరా జోడీపై జపాన్‌కు చెందిన ఎరీ హోజుమీ, మియూ కాటో జోడీ 6-3, 2-6, 6-2 తేడాతో విజయభేరి మోగించింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్ వన్ మార్టినా హింగిస్‌తో కలిసి ఆడుతున్న వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్ తొలి రౌండ్‌లో మార్క్ పొమాన్స్, డెస్టానీ అవా జోడీని 6-4, 6-3 తేడాతో ఓడించాడు.