క్రీడాభూమి

గణాంకాలు కాదు.. ఆటే ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 30: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ పురుషుల ఫైనల్‌లో ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్‌ను ఢీకొనేందుకు సిద్ధంగా ఉన్నానని బ్రిటిష్ ఆటగాడు, రెండో ర్యాంకర్ ఆండీ ముర్రే స్పష్టం చేశాడు. గతంలో ఎదుర్కొన్న పరాజయాలుగానీ, గణాంకాలుగానీ ముఖ్యంకాదని, ఎవరికైనా ప్రతి మ్యాచ్ కొత్త పోరాటమేనని అన్నాడు. జొకోవిచ్‌తో జరగబోయే ఫైనల్‌కు సిద్ధమవుతున్న ముర్రే శనివారం విలేఖరులతో మాట్లాడుతూ ఈ అంశాలనే ప్రస్తావించాడు. గణాంకాలను తాను పట్టించుకోబోనని స్పష్టం చేశాడు. క్రీడాకారుడికి ప్రతి మ్యాచ్ కీలకమైనదేనని, గణాంకాలు మ్యాచ్‌ల ఫలితాలను నిర్ణయించలేవని వ్యాఖ్యానించాడు. జొకోవిచ్ చేతిలో గతంలో ఎదుర్కొన్న పరాజయాలను గురించి తాను ఆలోచించడం లేదన్నాడు. ‘ఆదివారం నాటి మ్యాచ్‌లో నేను గెలవనన్న అభిప్రాయం చాలా మందిలో లేదనే అనుకుంటున్నాను. ఎంతో మందికి నాపై నమ్మకం ఉంది. నాపై నాకు విశ్వాసం ఉంది. ఇటీవల ఏవైందనేది ముఖ్యం కాదు. ఫైనల్‌లో ఎవరు ఏ విధంగా పోరాడతారన్నదే కీలకం. విజయం కోసం నేను సర్వశక్తులు ధారపోస్తాను. కడవరకూ శ్రమిస్తాను’ అని సెమీ ఫైనల్‌లో 17 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను సాధించిన రోజర్ ఫెదరర్‌ను ఓడించి ఫైనల్ చేరిన ముర్రే అన్నాడు. కెరీర్‌లో 11వ టైటిల్ సాధించాలన్న పట్టుదలతో ఉన్న జొకోవిచ్‌ను తాను తక్కువ అంచనా వేయడం లేదన్నాడు. అతనిని ఓడించమే లక్ష్యంగా బరిలోకి దిగుతానని చెప్పాడు.