క్రీడాభూమి

కోహ్లీ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత సారథి విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేసింది. ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి, మూడో వనే్డలో హాఫ్ సెంచరీ చేసే క్రమంలో అతను కెప్టెన్‌గా తన 17వ ఇన్నింగ్స్‌లోనే 1,000 పరుగుల మైలురాయిని దాటాడు. ఎబి డివిలియర్స్ దక్షిణాఫ్రికా జట్టుకు నాయకత్వం వహిస్తూ 18 ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగులను పూర్తిచేయగా, అంతకంటే వేగంగా ఈ ఫీట్‌ను ప్రదర్శించి కోహ్లీ రికార్డు సృష్టించాడు.
ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్ మూడు మ్యాచ్‌ల్లోనూ మూడు వందల కంటే ఎక్కువ పరుగులు చేయడం విశేషం. 2015లో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో 300 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఇంగ్లాండ్ ఈ సిరీస్‌లో మరోసారి అదే స్థాయిలో ఆడింది.

చిత్రం..విరాట్ కోహ్లీ