క్రీడాభూమి

బంగ్లాదేశ్‌పై కివీస్ క్లీన్‌స్వీప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైస్ట్‌చర్చి, జనవరి 23: రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్‌ను న్యూజిలాండ్ క్లీన్‌స్వీప్ చేసింది. ఇక్కడ జరిగిన రెండో టెస్టును తొమ్మిది వికెట్ల తేడాతో గెల్చుకొని, సిరీస్‌ను 2-0 తేడాతో సాధించింది. మూడో రోజు ఆట వర్షం కారణంగా రద్దయినప్పటికీ, కివీస్ ఎలాంటి ఇబ్బంది లేకుండా గెలవడం విశేషం. ఈ టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 289 పరుగులకు ఆలౌట్‌కాగా, న్యూజిలాండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్లకు 260 పరుగులు చేసింది. మూడో రోజు ఆట వర్షం వల్ల ఒక్క బంతి కూడా బౌల్ కాకుండానే రద్దుకాగా, నాలుగో రోజు ఉదయం ఆటను కొనసాగించి, 354 పరుగులకు ఆలౌటైంది. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబ్ అల్ హసన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో 65 వెనుకబడిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టి, 52.5 ఓవర్లలో 173 పరుగులకే కుప్పకూలింది. మహమ్మదుల్లా 38 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, సౌమ్య సర్కార్ (36), చివరిలో తస్కిన్ అహ్మద్ (33) కొంత వరకూ కివీస్ బౌలింగ్‌ను ప్రతిఘటించారు. కానీ, వీరిలో ఎవరూ జట్టును ఆదుకోలేకపోయారు. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ, నీల్ వాగ్నర్ తలా మూడేసి వికెట్లు పడగొట్టి, బంగ్లాదేశ్‌ను కట్టడి చేశారు. బంగ్లాదేశ్ నిర్దేశించిన 109 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ కేవలం 18.4 ఓవర్లలోనే ఛేదించింది. జీల్ రావల్ 33 పరుగులు చేసి అవుట్‌కాగా, టామ్ లాథమ్ (41), కొలిన్ డి గ్రాండ్‌హోమ్ (33) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ జట్టును గెలిపించారు. మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు, రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు పడగొట్టిన టిమ్ సౌథీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
సంక్షిప్త స్కోర్లు
బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్: 84.3 ఓవర్లలో 289 ఆలౌట్ (సౌమ్య సర్కార్ 86, షకీబ్ అల్ హసన్ 59, నూరుల్ హసన్ 47, టిమ్ సౌథీ 5/94, ట్రెంట్ బౌల్ట్ 4/87).
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 92.4 ఓవర్లలో 354 ఆలౌట్ (టామ్ లాథమ్ 68, రాస్ టేలర్ 77, హెన్రీ నికోల్స్ 98, షకీబ్ అల్ హసన్ 4/50, కమ్రుల్ ఇస్లామ్ రబ్బీ 2/78).
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్: 52.5 ఓవర్లలో 173 ఆలౌట్ (సౌమ్య సర్కార్ 36, మహమ్మదుల్లా 38, తస్కిన్ అహ్మద్ 33, కమ్రుల్ ఇస్లామ్ రబ్బీ 25, ట్రెంట్ బౌల్ట్ 3/52, టిమ్ సౌథీ 3/48, నీల్ వాగ్నర్ 3/44).
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ (లక్ష్యం 109 పరుగులు): 18.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 111 (జీల్ రావల్ 33, టామ్ లాథమ్ 41 నాటౌట్, కొలిన్ డి గ్రాండ్‌హోమ్ 33 నాటౌట్).

చిత్రం..న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌కు ఫినిషింగ్ టచ్ ఇచ్చిన గ్రాండ్‌హోమ్, టామ్ లాథమ్