క్రీడాభూమి

చెమటోడ్చిన నాదల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 23: జపాన్ సూపర్ స్టార్ కెయ్ నిషికొరీని ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ పురుషుల సింగిల్స్ నాలుగో రౌండ్‌లో అతి కష్టం మీద ఓడించిన ప్రపంచ మాజీ నంబర్ వన్, ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్ క్వార్టర్ ఫైనల్స్ చేరాడు. మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడినప్పటికీ నిషికొరీ నుంచి అతనికి గట్టిపోటీ ఎదురైంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనుకంజ వేయని మొండితనంతోనే అతను నిషికొరీ లాంటి మేటి ఆటగాడిని కూడా విజృంభించకుండా సమర్థంగా అడ్డుకోగలిగాడు. మూడోరౌండ్‌లో ప్రత్యర్థి నుంచి తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదురుకావడంతో, దానిని నాదల్ చేజార్చుకున్నాడు. అయితే, నాలుగో సెట్‌లో మళ్లీ తనదైన శైలిలో విరుచుకుపడి విజయభేరి మోగించాడు. మూడేళ్ల క్రితం నాదల్ చివరిసారి ఇక్కడ క్వార్టర్ ఫైనల్స్ చేరాడు. నిరుడు మూడో రౌండ్ వరకూ వెళ్లినప్పటికీ, రోజర్ ఫెదరర్ చేతిలో ఓటమిపాలై నిష్క్రమించాడు. డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్, ప్రపంచ నంబర్ వన్ ఆండీ ముర్రే పరాజయాలను ఎదుర్కొని నిష్క్రమించడంతో, ఈసారి టైటిల్ వేటలో నాదల్ ముందు వరుసలో ఉన్నాడు. మరో మ్యాచ్‌లో మూడో ర్యాంక్ ఆటగాడు మిలోస్ రానిక్ 7-6, 3-6, 6-4, 6-1 తేడాతో 13వ ర్యాంకర్ రాబర్టో బటిస్టా అగుట్‌ను ఓడించి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాడు.

క్వార్టర్ ఫైనల్ చేరిన రాఫెల్ నాదల్