క్రీడాభూమి

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ధీమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జనవరి 23: భారత ఓపెనర్లు ఫామ్‌లోకి వస్తారని, ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కెప్టెన్ విరాట్ కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు. మరో ఐదు నెలల్లో, ఇంగ్లాండ్‌లో జరిగే చాంపియన్స్ ట్రోఫీకి అన్ని విధాలా సిద్ధమవుతామని అన్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టి-20 తాము సన్నద్ధం కావడానికి ఉపయోగపడుతుందని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు వనే్డల్లోనూ భారత ఓపెనర్లు దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. పుణేలో జరిగిన తొలి వనే్డలో లోకేష్ రాహుల్ 8 పరుగులు చేస్తే, శిఖర్ ధావన్ ఒక పరుగుకే వెనుదిరిగాడు. కటక్ వనే్డలో రాహుల్ 5, ధావన్ 11 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. కోల్‌కతాలో జరిగిన మూడో వనే్డకు గాయం కారణంగా ధావన్ బరిలోకి దిగలేదు. అతని స్థానంలో రాహుల్‌తోపాటు ఆజింక్య రహానే ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టాడు. అతను కేవలం ఒక పరుగుకే అవుట్‌కాగా, రాహుల్ ఇన్నింగ్స్ 11 పరుగులకే ముగిసింది. టీమిండియా మిడిల్ ఆర్డర్ పటిష్టంగా ఉన్నప్పటికీ ఓపెనర్ల వైఫల్యాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, క్రికెట్‌లో ఇది చాలా సహజమని కోహ్లీ వ్యాఖ్యానించాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడేందుకు భారీ సంఖ్యలో ఆటగాళ్లు ఎప్పుడూ సిద్ధంగా ఉండరని అన్నాడు. ఒకటి రెండు ఇన్నింగ్స్‌లో రాణించలేనంత మాత్రాన ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదని హితవు పలికాడు. విఫలమవుతున్న వారికి మరికొన్ని అవకాశాలిస్తే, మళ్లీ ఫామ్‌లోకి వస్తారన్న నమ్మకం తనకు ఉందన్నాడు.
నిలకడే కీలకం..
వచ్చే ఏడాది జూన్ మాసంలో ఇంగ్లాండ్‌లో జరగనున్న చాంపియన్స్ ట్రోఫీ గురించి ప్రస్తావించగా, నిలకడగా రాణించడమే ఏ జట్టుకైనా ప్రధానమని అన్నాడు. ఇంగ్లాండ్‌తో మూడు వనే్డల సిరీస్ ముగియగా, చాంపియన్స్ ట్రోఫీ వరకూ భారత్ ఈ ఫార్మాట్‌లో మ్యాచ్‌లు ఆడడం లేదు. ఇంగ్లాండ్‌తో టి-20, ఆతర్వాత ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పాల్గొంటుంది. దీనితో ఆటగాళ్లకు తగినంత ప్రాక్టీస్ ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అయితే, వనే్డ ఫార్మాట్‌లో మ్యాచ్‌లు ఆడనంత మాత్రానే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కోహ్లీ స్పష్టం చేశాడు. ఇంగ్లాండ్‌తో వనే్డ సిరీస్‌కు ముందు అదే జట్టుతో టెస్టు సిరీస్ ఆడిన విషయాన్ని గుర్తుచేశాడు. చివరి ఓవర్లలో ఏ విధంగా క్రీజ్‌లో నిలబడాలి, అనవసరమైన షాట్లకు వెళ్లకుండా ఎలా జాగ్రత్త పడాలి అన్న విషయాల్లో అవగాహన టెస్టుల్లో ఆడడం వల్ల ఏర్పడుతుందని చెప్పాడు. అదే విధంగా, టి-20 సిరీస్‌లు ఆడడం ద్వారా, సమయానికి అనువుగా ఆడే విధానం అలవడుతుందని చెప్పాడు. వనే్డ ఫార్మాట్‌లో జరిగే చాంపియన్స్ ట్రోఫీకి ఇంగ్లాండ్‌తో జరిగే టి-20, ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌లు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నాడు. ప్రతి మ్యాచ్‌లోనూ నిలకడే కీలకమవుతుందని చెప్పాడు. ధోనీ, యువరాజ్ సింగ్, కేదార్ జాదవ్ తదితరులు బ్యాటింగ్‌లో రాణించిన విషయాన్ని అ తను ప్రస్తావిస్తూ, నిలకడ ఎంత కీలకమన్నది చెప్పడానికి వారి అసాధారణ ఇన్నింగ్సే నిదర్శనమని అన్నాడు.

చిత్రం..విరాట్ కోహ్లీ