క్రీడాభూమి

‘ఆస్ట్రేలియా’ క్వీన్ కెర్బర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ రోజు కోసం నేను చాలాకాలంగా ఎదురుచూస్తున్నాను. ఇది నా జీవితకాల స్వప్నం. ఇకపై నేను కూడా గ్రాండ్ శ్లామ్ విజేతనని గుర్వంగా చెప్పుకోగలుగుతాను. మాజీ చాంపియన్ స్ట్ఫె గ్రాఫ్‌ను ఆదర్శంగా తీసుకొని నేను చాలా కష్టపడ్డాను. ఇన్నాళ్లకు నా కల ఫలించింది. నా కెరీర్‌లో ఈ రెండు వారాలు అత్యుత్తమమైనవి. ఈ విజయం నాకు చిరస్మరణీయమైనది.
- ఏంజెలిక్ కెర్బర్

కెర్బర్ గెలిచినందుకు నేను సంతోషిస్తున్నాను. చాలాకాలంగా ఆమె పలు టోర్నీల్లో పోటీపడుతున్నది. ఇనే్నళ్లకు గ్రాండ్ శ్లామ్ టైటిల్ సాధింనందుకు ఆమెను అభినందిస్తున్నాను. ఫైనల్‌లో నేను శక్తి వంచన లేకుండా విజయం కోసం కృషి చేశాను. చెమటోడ్చాను. కానీ, నా కంటే కెర్బర్ బాగా ఆడిందని మ్యాచ్ ఫలితం స్పష్టం చేస్తున్నది. రానున్న టోర్నీల్లో మళ్లీ సత్తా నిరూపించుకుంటాను. విజయాలను సాధిస్తాను.
- సెరెనా విలియమ్స్

మెల్బోర్న్, జనవరి 30: జర్మనీ క్రీడాకారిణి ఏంజెలిక్ కెర్బర్ సంచలనం సృష్టించింది. ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ ఫైనల్‌లో ప్రపంచ నంబర్ వన్, డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్‌ను ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. ఇప్పుడు ఆమె ఖాతాలో కెరీర్‌లో 8 డబ్ల్యుటిఎ, 11 ఐటిఎఫ్ టైటిళ్లు ఉన్నాయి. తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరుస్తూ, టైటిల్ ఫేవరిట్‌గా ఫైనల్‌కు దూసుకొచ్చిన సెరెనాకు కెర్బర్ నుంచి ఈ స్థాయిలో ప్రతిఘటనగానీ, ఎదురుదెబ్బగానీ ఎవరూ ఊహించలేదు. సెరెనా తీవ్ర స్థాయిలో పోరాడినప్పటికీ కెర్బర్ మ్యాచ్‌ని 6-4, 3-6, 6-4 తేడాతో గెల్చుకుంది. ఒక గ్రాండ్ శ్లామ్ టోర్నీలో తొలిసారి ఫైనల్ చేరిన ఆమె టైటిల్‌ను కూడా సాధించడం విశేషం. గతంలో అత్యుత్తమంగా ఆమె యుఎస్ ఓపెన్ (2011), వింబుల్డన్ (2012) టోర్నీల్లో సెమీ ఫైనల్ వరకూ చేరింది. మరో గ్రాండ్ శ్లామ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో 28 ఏళ్ల కెర్బర్ ఉత్తమంగా 2012లో క్వార్టర్ ఫైనల్స్ వరకూ వెళ్లింది. ఆస్ట్రేలియా ఓపెన్‌లో గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్న సెరెనాను ఫైనల్‌లో ఢీకొనే కెర్బర్ టైటిల్ సాధించడం కష్టమని అందరూ అనుకున్నారు. కానీ, ఆమె ఈ టోర్నీ ఆరంభం నుంచి కొనసాగిస్తున్న దూకుడునే ఫైనల్‌లోనూ కొనసాగించింది. మొదటి రౌండ్‌లో మిసాకీ డోయ్‌ని ఓడించి శుభారంభం చేసిన కెర్బర్ రెండో రౌండ్‌లో అలెక్సాండ్రా డల్గెరూపై విజయం సాధించింది. మూడో రౌండ్‌లో మాడిసన్ బ్రెంగిల్‌పై గెలిచింది. నాలుగో రౌండ్‌లో అనీకా బెక్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్స్ చేరింది. సెమీస్‌కు చేరుకునే క్రమంలో విక్టోరియా అజరెన్కాను ఇంటిదారి పట్టించింది. క్వార్టర్ ఫైనల్స్‌లో విజయం అదృష్టవశాత్తు లభించిందేగానీ ప్రతిభతో కాదన్న విమర్శలకు సెమీ ఫైనల్‌లో జొహాన్నా కొన్టాను ఓడించి తెరదించింది. క్వార్టర్స్, సెమీస్ విజయాలతో జెయింట్ కిల్లర్ అన్న ముద్ర వేయించుకొని, ఫైనల్‌లో సెరెనాను ఢీకొనేందుకు సిద్ధమైనప్పుడు కూడా విశే్లషకులు ఏ దశలోనూ కెర్బర్‌ను ఫేవరిట్‌గా పేర్కోలేదు. ‘అండర్ డాగ్’ ముద్రే ఒక రకంగా కెర్బర్ విజయానికి కారణమైంది. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడిన ఆమె సెరెనాను కంగుతినిపించి టైటిల్ సాధించింది.
రెండో స్థానం ఖాయం!
ప్రపంచ నంబర్ వన్ సెరెనా విలియమ్స్‌ను ఓడించి ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను సాధించిన ఏంజెలిక్ కెర్బర్‌కు త్వరలోనే ప్రకటించనున్న డబ్ల్యుటిఎ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానం దక్కడం ఖాయంగా కనిపిస్తున్నది. సోమవారం ప్రకటించే ర్యాంకింగ్స్‌లో సెరెనా విలియమ్స్ తన నంబర్ వన్ స్థానాన్ని కొనసాగించనుంది. కెర్బర్ రెండో స్థానానికి చేరుకుంటే, ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న సిమోనా హాలెప్ మూడో స్థానానికి పడిపోతుంది. సెమీస్‌లో సెరెనా చేతిలో పరాజయాన్ని ఎదుర్కొన్న అగ్నీస్కా రద్వాన్‌స్కాకు నాలుగో స్థానం లభిస్తుంది. గార్బినే ముగురుజా స్థానం మూడు నుంచి ఐదుకు పతనమవుతుంది.
‘డిఫెండింగ్’కు నిరాశ
కెరీర్‌లో 21 గ్రాండ్ శ్లామ్ సింగిల్స్ టైటిళ్లను కైవసం చేసుకున్న సెరెనా ఫైనల్‌లో కెర్బర్‌ను ఓడించడం ద్వారా కెరీర్‌లో 22 టైటిళ్లు సాధించిన స్ట్ఫె గ్రాఫ్ సరసన స్థానం సంపాదించాలని అనుకుంది. టోర్నీ ఆరంభం నుంచి అసాధారణ ఫామ్‌ను కొనసాగించిన సెరెనా తుది ఘట్టంలో తడబడింది. పరాజయాన్ని ఎదుర్కొని నిరాశ చెందింది. ఈటోర్నీ మొదటి రౌండ్‌లో కామిలా గియోర్గీపై విజయం సాధించిన సెరెనా రెండో రౌండ్‌లో సూవెయ్ షీని ఓడించింది. మూడో రౌండ్‌లో డరియా కసట్కినా, నాలుగో రౌండ్‌లో మార్గరీట గాస్పర్యాన్‌లపై గెలుపొంది క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. రష్యా బ్యూటీ షరపోవాపై పూర్తి ఆధిక్యాన్ని కొనసాగిస్తూ, వరుస సెట్లలో ఆమెను ఓడించి సుమీస్ చేరింది. అగ్నీస్కా రద్వాన్‌స్కా నుంచి ప్రతిఘటన ఎదురైనప్పటికీ సమర్థంగా తిప్పికొట్టి సెమీస్‌ను ముగించింది. అయితే, ఫైనల్‌లో ఎవరూ ఊహించని విధంగా పరాజయాన్ని చవిచూసింది.