క్రీడాభూమి

మరో గ్రాండ్ శ్లామ్ దిశగా ఫెదరర్ అడుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 26: కెరీర్‌లో 17 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లు సాధించి, ప్రపంచ రికార్డు నెలకొల్పిన ప్రపంచ మాజీ నంబర్ వన్ రోజర్ ఫెదరర్ మరో టైటిల్ అందుకునే దిశగా దూసుకెళుతున్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్‌లో అతను స్టానిస్లాస్ వావ్రిన్కాను 7-5, 6-3, 1-6, 4-6, 6-3 తేడాతో ఓడించి ఫైనల్ చేరాడు. మొదటి రెండు సెట్లను గెల్చుకున్న తర్వాత, వరుసగా రెండు సెట్లను చేజార్చుకున్న అతను చివరిదైన ఐదో సెట్‌లో సర్వశక్తులు ఒడ్డి పోరాడాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 17వ స్థానంలో ఉన్న ఫెదరర్ నాలుగో ర్యాంకర్ వావ్రిన్కాను ఓడించిన తీరు అతని పట్టుదలకు అద్దం పడుతుంది. గ్రాండ్ శ్లామ్ టోర్నీల్లో ఫెదరర్ ఫైనల్ చేరడం ఇది 28వసారి. ఇప్పటి వరకూ 27 పర్యాయాలు ఫైనల్ చేరుకొని, 17 విజయాలు సాధించిన అతను పదిసార్లు రన్నరప్‌గా నిలిచాడు. ఈసారి ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్‌లో అతను రాఫెల్ నాదల్ లేదా గ్రిగర్ దిమిత్రోవ్‌ను ఢీ కొంటాడు. రెండో సెమీ ఫైనల్ శుక్రవారం జరుగుతుంది. ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను గతంలో నాలుగు పర్యాయాలు (2004, 2006, 2007, 2010) టైటిల్ సాధించిన ఫెదరర్ ఇక్కడ ఐదవ, మొత్తం మీద 18వ గ్రాండ్ శ్లామ్ టైటిల్ కోసం పోరాడనున్నాడు. డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్, ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు ఆండీ ముర్రే పరాజయాలను ఎదుర్కొని నిష్క్రమించడంతో ఈసారి టైటిల్ రేసులో రాఫెల్ నాదల్‌తో కలిసి ఫెదరర్ ముందు వరుసలో నిలిచాడు. అందరి అంచనాలకు తగినట్టుగానే అతను ఫైనల్ చేరాడు. రెండో సెమీ ఫైనల్‌లోనూ అనుకున్న రీతిలో ఫలితం వెలువడితే, నాదల్‌తో ఫెదరర్ తుది పోరు ఖాయమవుతుంది.
పేస్, హింగిస్ జోడీ నిష్క్రమణ
ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో లియాండర్ పేస్, మార్టినా హింగిస్ జోడీ ఓటమిపాలైంది. క్వార్టర్ ఫైనల్స్‌లో వీరిపై శామ్ గ్రాత్, సమంతా స్టొసుర్ జోడీ 6-3, 6-2 తేడాతో సులభంగా గెలిచి సెమీస్ చేరింది.