క్రీడాభూమి

వార్నర్, హెడ్ విజృంభణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడెలైడ్, జనవరి 26: ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్ సెంచరీలతో విజృభించడంతో 50 ఓవర్లలో 7 వికెట్లకు 369 పరుగుల భారీ స్కోరు సాధించిన ఆస్ట్రేలియా తర్వాత పాకిస్తాన్‌ను 312 పరుగులకు కట్టడి చేసి, చివరిదైన ఐదో వనే్డను 57 పరుగుల తేడాతో గెల్చుకుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు వార్నర్, హెడ్ గట్టి పునాది వేశారు. మొదటి వికెట్‌కు వీరు 284 పుగులు జోడించారు. 128 బంతులు ఎదుర్కొని, 19 ఫోర్లు, 5 సిక్సర్లతో 179 పరుగులు చేసిన వార్నర్‌ను బాబర్ ఆజమ్ క్యాచ్ పట్టగా జునైద్ ఖాన్ అవుట్ చేయడంతో ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (4), గ్లేన్ మాక్స్‌వెల్ (13), వికెట్‌కీపర్ మాథ్యూ వేడ్ (8) ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేక పెవిలియన్ చేరారు. కాగా, 137 బంతుల్లో 128 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ చివరికి హసన్ అలీ బౌలింగ్‌లో అజర్ అలీ క్యాచ్ పట్టగా ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. అతని స్కోరులో 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. పీటర్ హ్యాండ్స్‌కోమ్ (1), మిచెల్ స్టార్క్ (6) కూడా తక్కువ పరుగులకే వెనుదిరిగారు. 50 ఓవర్లు ముగిసే సమయానికి జేమ్స్ ఫాల్క్‌నెర్ (18), పాట్ కమిన్స్ (1) క్రీజ్‌లో ఉన్నారు. పాక్ బౌలర్లు జునైద్ ఖాన్, హసన్ అలీ చెరి రెండు వికెట్లు కూల్చారు.
ఆజమ్ శతకం వృథా
విజయానికి 370 పరుగుల భారీ స్కోరు సాధించాల్సి ఉండగా, కేవలం పది పరుగుల స్కోరువద్ద పాకిస్తాన్ తొలి వికెట్‌ను కెప్టెన్ అజర్ అలీ (6) రూపంలో కోల్పోయింది. అయితే, ఈ పరిణామానికి ఏమాత్రం భయపడని ఓపెనర్ షర్జీల్ ఖాన్, ఫస్ట్‌డౌన్ ఆటగాడు బాబర్ ఆజమ్ ధాటిగా ఆడుతూ స్కోరుబోర్డును ముందుకు దూకించారు. వీరు రెండో వికెట్‌కు 130 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించారు. 79 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద షర్జీల్ ఖాన్ అవుట్ కావడంతో పాక్ ఎదురుదాడికి గండిపడింది. ఆజమ్ 109 బంతులు ఎదుర్కని, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 100 పరుగులు చేసి అవుట్‌కాగా, చివరిలో ఉమర్ అక్మల్ 46 పరుగులు సాధించాడు. మిగతా బ్యాట్స్‌మెన్ వేగంగా పరుగులు రాబట్టడంలో విఫలమయ్యా రు. దీనితో పాక్ 49.1 ఓవర్లలో 312 పరుగులకు ఆలౌటైంది.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: 50 ఓవర్లలో 7 వికెట్లకు 369 (డేవిడ్ వార్నర్ 179, ట్రావిస్ హెడ్ 128, జునైద్ ఖాన్ 2/61, హసన్ అలీ 2/100).
పాకిస్తాన్ ఇన్నింగ్స్: 49.1 ఓవర్లలో 312 ఆలౌట్ (బాబర్ ఆజమ్ 100, షర్జీల్ ఖాన్ 79, ఉమర్ అక్మర్ 46, మిచెల్ స్టార్క్ 4/42, పాట్ కమిన్స్ 2/60).

చిత్రం..సెంచరీ హీరోలు డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్