క్రీడాభూమి

‘సయ్యద్ మోదీ’ విజేత శ్రీకాంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జనవరి 31: ప్రతిష్ఠాత్మక సయ్యద్ మోదీ బాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను తెలుగు వీరుడు, టాప్ సీడ్ కిడాంబి శ్రీకాంత్ కైవసం చేసుకున్నాడు. బాబూ బనారసీ దాస్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్‌లో అతను హుయాంగ్ యూజియాంగ్‌ను 21-13, 14-21, 21-14 తేడాతో ఓడించాడు. సుమారు గంట సేపు జరిగిన పోరులో మొదటి సెట్‌ను సులభంగానే గెల్చుకున్న శ్రీకాంత్‌కు రెండో సెట్‌లో ఎదురుదెబ్బ తగిలింది. యూజియాంగ్ ఆ సెట్‌ను తన ఖాతాలో వేసుకోవడంతో, మూడో సెట్ అత్యంత కీలకంగా మారింది. దానిని తన ఖాతాలో వేసుకొన్న శ్రీకాంత్ మూడో ప్రయత్నంలో విజేతగా నిలిచాడు. గత రెండేళ్లు అతను ఫైనల్ చేరినప్పటికీ రన్నరప్ ట్రోఫీతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. అయితే, ఈసారి తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు.
డబుల్స్‌లో ఓడిన భారత జోడీ
పురుషుల డబుల్స్‌లో భారత్‌కు నిరాశ తప్పలేదు. ప్రవీణ్ జెర్రీ చోప్రా, ఆకాష్ దెవాల్కర్ జోడీ ఫైనల్‌లో పరాజయాన్ని ఎదుర్కొని, రన్నరప్ ట్రోఫీతో సంతృప్తి చెందారు. వీరిపై షెన్ గో, వీ కియాంగ్ తాన్ జోడీ 14-21, 24-22, 21-8 స్కోరుతో గెలుపొందారు.