క్రీడాభూమి

జట్టు కూర్పుపై కోహ్లీ మల్లగుల్లాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగపూర్, జనవరి 28: ఇంగ్లాండ్‌తో అత్యంత కీలకమైన రెండో టి-20 ఆదివారం జరగనుండగా, తుది జట్టు కూర్పు ఎలా ఉండాలనే అంశంపై భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మల్లగుల్లాలు పడుతున్నాడు. ఫార్మాట్ ఎదైనా, ఇప్పటి వరకూ ఒక్క సిరీస్‌ను కూడా కోల్పోని కెప్టెన్‌గా గుర్తింపు పొందిన కోహ్లీ ఇప్పుడు ఆ రికార్డును కోల్పోయే ప్రమాదంలో పడ్డాడు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భాగంగా కాన్పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఇంకా 11 బంతులు మిగిలి ఉండగానే, ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. దీనితో 0-1 తేడాతో వెనుకబడిన టీమిండియాకు రెండో మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. ఒకవేళ దీనిని కూడా కోల్పోతే, సిరీస్‌ను 0-2 తేడాతో చేజార్చుకుంటుంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లకూ కెప్టెన్‌గా ఎంపికైన తర్వాత ఇంగ్లాండ్‌పై మొదటి వనే్డ సిరీస్‌ను ఆడి, విజయం సాధించిన కోహ్లీకి అదే జట్టుతో జరిగే టి-20 సిరీస్ పరీక్ష పెట్టనుంది. కెప్టెన్‌గా సిరీస్‌ను చేజార్చుకోకుండా జాగ్రత్త పడడమే కోహ్లీ బృందం ప్రధాన లక్ష్యం. టీమిండియా చివరిసారి 2015 అక్టోబర్‌లో, దక్షిణాఫ్రికా చేతిలో ఒక సిరీస్‌ను కోల్పోయింది. అప్పటి నుంచి ఇంత వరకూ భారత్‌కు సిరీస్ పరాజయం ఎదుకాలేదు. కాబట్టి, ఆదివారం నాటి మ్యాచ్‌లో సిరీస్‌పై ఆశలను సజీవంగా ఉంచుకోవడానికి టీమిండియా ప్రాధాన్యమిస్తుంది. అయితే, అనూహ్య ఫలితాలు నమోదు అయ్యేందుకు ఎక్కువ అవకాశాలున్న టి-20 ఫార్మాట్‌లో ఎవరికి తుది జట్టులో అవకాశం ఇవ్వాలి? ఎవరిపై వేటు వేయాలి? అని తేల్చుకోవడం కోహ్లీకి కష్టమవుతుంది. కోహ్లీ, ధోనీ, యువరాజ్ సింగ్‌లతో భారత మిడిల్ ఆర్డర్ పటిష్టంగా కనిపిస్తున్నది. మనీష్ పాండే ఆరో స్థానంలో క్రీజ్‌లోకి రావచ్చు. కాగా, తుది జట్టును ఖరారు చేసే సమయంలో, పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో ఓపెనర్ లోకేష్ రాహుల్ తనపై ఉన్న అంచనాలకు తగినట్టు ఆడకపోవడాన్ని కెప్టెన్ కోహ్లీ, కోచ్ అనిల్ కుంబ్లే దృష్టిలో ఉంచుకోవడం ఖాయం. నిజానికి బలమైన బ్యాటింగ్ ఆర్డర్‌ను చూస్తే, మొదటి టి-20లో భారత్ కేవలం 147 పరుగులే చేయగలగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. మాజీ కెప్టెన్ ధోనీ 36 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడంటే, మిగతా ఆటగాళ్ల బ్యాటింగ్ వైఫల్యాలు ఏ స్థాయిలో కొనసాగాయో అర్థమవుతుంది. బౌలింగ్ విభాగానికి వస్తే, లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్‌ను మినహాయిస్తే మిగతా వారు ఆ స్థాయిలో రాణించలేకపోయారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుంటే, యువ వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్, మొదటి టి-20లో బెంచ్‌కి పరిమితమైన ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌కు ఆదివారం నాటి మ్యాచ్‌లో ఆడే అవకాశం దక్కవచ్చు.
కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మంచి ఫామ్‌లో ఉండడం ఇంగ్లాండ్‌కు కలిసొచ్చే అంశం. అతను మొదటి మూడు వనే్డల్లో వరుసగా 28, 102, 43 చొప్పున పరుగులు చేశాడు. మొదటి టి-20లో మెరుపువేగంతో పరుగులు రాబట్టాడు. అతను 38 బంతుల్లోనే 51 పరుగులు చేయడం విశేషం. మొత్తం మీద ఇంగ్లాండ్ మొదటి మ్యాచ్‌లో ఆడిన జట్టునే ఎలాంటి మార్పులు లేకుండా రెండో టి-20లోనూ కొనసాగించే అవకాశాలున్నాయి. భారత్ ఒకటి రెండు మార్పులు చేయవచ్చు.
మ్యాచ్ ఆదివారం రాత్రి 7 గంటలకు మొదలవుతుంది.