క్రీడాభూమి

హ్యున్‌కు మహిళల టైటిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జనవరి 31: మహిళల సింగిల్స్ టైటిల్‌ను రెండో సీడ్ సంగ్ జి హ్యున్ తన ఖాతాలో వేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో ఆమె ఐదో ర్యాంక్‌లో ఉన్న సయాకా సటోపై 12-21, 21-18, 21-18 ఆధిక్యంతో గెలుపొందింది. మొదటి సెట్‌ను కోల్పోయిన హ్యున్ ఆతర్వాత ఎదురుదాడికి దిగింది. సయాకా నుంచి తీవ్ర స్థాయిలో పోటీ ఎదురైనప్పటికీ సమర్థంగా ఎదురునిలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది. మహిళల డబుల్స్‌లో జంగ్ క్యున్ ఎన్, షిన్ సియాంగ్ చాన్ జోడీ టైటిల్ సాధించింది. ఫైనల్‌లో ఈ జోడీ 21-15, 21-13 ఆధిక్యంతో ఎఫ్జే మస్కెన్స్, సెలెనా పీక్ జోడీపై విజయం సాధించింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో ప్రవీణ్ జోర్డాన్, డెబ్బీ సుశాంతో జోడీ 23-25, 21-9, 21-16 తేడాతో పౌవరనుక్రో డెచాపొల్, సాస్పిరియా తయెరతన చయ్ జోడీని ఓడించింది.