క్రీడాభూమి

హోరాహోరీలో భారత్ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగపూర్, జనవరి 29: ఇంగ్లాండ్‌తో ఆదివారం జరిగిన రెండో టి-20 మ్యాచ్‌ని గెల్చుకున్న భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌పై ఆశలు సజీవంగా నిలబెట్టుకుంది. చివరి బంతి వరకూ అంతులేని ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో 145 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన ఇంగ్లాండ్ ఐదు పరుగుల తేడాతో ఓడింది. జస్‌ప్రీత్ బుమ్రా చివరి ఓవర్‌ను అద్భుతంగా వేసి, భారత్ విజయంలో ప్రధాన భూమిక పోషించాడు.
రాహుల్ పోరాటం
లోకేష్ రాహుల్ ఒంటరి పోరాటం జరిపితే, మిడిల్ ఆర్డర్‌లో మనీష్ పాండే కొంత వరకూ ఇంగ్లాండ్ బౌలింగ్‌ను ప్రతిఘటించారు. మిగతా బ్యాట్స్‌మెన్ నిర్లక్ష్యంగా ఆడి వికెట్లు పారేసుకున్నారు. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 30 పరుగుల స్కోరువద్ద తొలి వికెట్‌ను కెప్టెన్ విరాట్ కోహ్లీ రూపంలో కోల్పోయింది. ఓపెనింగ్ కాంబినేషన్ ఇంకా ఖరారుకాని నేపథ్యంలో తాను ఇన్నింగ్స్ ప్రారంభించిన కోహ్లీ 15 బంతుల్లో 21 పరుగులు చేసి, క్రిస్ జోర్డార్ బౌలింగ్‌లో లియామ్ డాసన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సురేష్ రైనా (7), యువరాజ్ సింగ్ (4) క్రీజ్‌లోకి వచ్చినట్టే వచ్చి పెవిలియన్ చేరడంతో 69 పరుగులకే భారత్ మూడు వికెట్లు చేజార్చుకుంది. క్రీజ్‌లో నిలదొక్కుకునే ప్రయత్నం చేసి, 47 బంతులు ఎదుర్కొని 71 పరుగులు (ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు) సాధించిన రాహుల్‌ను బెన్ స్టోక్స్ క్యాచ్ పట్టగా క్రిస్ జోర్డాన్ అవుట్ చేశాడు. 26 బంతుల్లో 30 పరుగులు చేసిన మనీష్ పాండేను టైమల్ మిల్స్ క్లీన్ బౌల్డ్ చేశాడు. హార్దిక్ పాండ్య (2), అమిత్ మిశ్రా (0) ఒకే ఓవర్‌లో అవుటయ్యారు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రిస్ జోర్డాన్ ఇన్నింగ్స్ చివరి ఓవర్ చివరి బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 144 పరుగులు చేసింది. క్రిస్ జోర్డాన్ 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.
నెహ్రా తొలి దెబ్బ
రెండో మ్యాచ్‌ని కూడా గెల్చుకొని, సిరీస్‌ను సొంతం చేసుకోవడానికి 145 పరుగులు సాధించాల్సి ఉండగా, ఇంగ్లాండ్‌ను 22 పరుగుల వద్ద ఆశిష్ నెహ్రా తొలి దెబ్బ తీశాడు. ఒకే ఓవర్‌లో అతను సామ్ బిల్లింగ్స్ (12), జాసన్ రాయ్ (10)లను పెవిలియన్ పంపాడు. జట్టు స్కోరు 65 పరుగుల వద్ద కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ వికెట్ కూలింది. 17 పరుగులు చేసిన అతనిని హార్దిక్ పాండ్య క్యాచ్ పట్టగా అమిత్ మిశ్రా అవుట్ చేశాడు. బెన్ స్టోక్స్ 27 బంతుల్లో, రెండు ఫోర్లు, మరో రెండు సిక్సర్లతో 39 పరుగులు చేసి ఆశిష్ నెహ్రా బౌలింగ్‌లో ఎల్‌బిగా వెనుదిరాడు. చివరి ఓవర్‌లో విజయానికి ఎనిమిది పరుగుల దూరంలో నిలిచిన ఇంగ్లాండ్‌ను కట్టడి చేసే బాధ్యతను జస్‌ప్రీత్ బుమ్రాకు భారత కెప్టెన్ కోహ్లీ అప్పచెప్పాడు. దీనిని సమర్థంగా పోషించిన అతను మొదటి బంతిలోనే జో రూట్‌ను అవుట్ చేశాడు. రూట్ 38 బంతుల్లో 38 పరుగులు చేశాడు. రెండో బంతికి మోయిన్ అలీ సింగిల్ తీయగా, మూడో బంతిలో ఒక్క పరుగు కూడా రాలేదు. నాలుగో బంతిలో జొస్ బట్లర్ (15) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఐదో బంతిలో ఒక పరుగు లెగ్‌బై రూపంలో ఇంగ్లాండ్‌కు లభించింది. దీనితో చివరి బంతిలో ఇంగ్లాండ్ గెలవడానికి ఆరు పరుగులు అవసరమయ్యాయి. కానీ, ఆ బంతికి మోయిన్ అలీ బీట్ కావడంతో ఒక్క పరుగు కూడా లభించలేదు. భారత్ ఐదు పరుగుల తేడాతో గెలిచింది.

చివరి ఓవర్‌ను అద్భుతంగా బౌల్ చేసిన జస్‌ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ అవార్డును స్వీకరించిన తర్వాత అతను మాట్లాడుతూ డెత్ ఓవర్లలో సమర్థంగా బంతులు వేయడం అనుకున్నంత సులభం కాదని అన్నాడు. అయతే, ఇంతకు ముందు ఇలాంటి పరిస్థితుల్లోనే తాను చక్కగా రాణించిన విషయాన్ని గుర్తు తెచ్చుకొని, ఎలాంటి అనుమానం లేకుండా చివరి ఓవర్‌కు సిద్ధమయ్యానని అన్నాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాట్లాడుతూ చివరి ఓవర్‌ను సరిగ్గా ఆడలేకపోవడంతోనే ఓడామని అన్నాడు.

స్కోరుబోర్డు
భారత్ ఇన్నింగ్స్: విరాట్ కోహ్లీ సి లియామ్ డాసన్ బి క్రిస్ జోర్డాన్ 21, లోకేష్ రాహుల్ సి బెన్ స్టోక్స్ బి క్రిస్ జోర్డాన్ 71, సురేష్ రైనా సి క్రిస్ జోర్డాన్ బి అదిల్ రషీద్ 7, యువరాజ్ సింగ్ ఎల్‌బి మోయిన్ అలీ 4, మనీష్ పాండే బి టైమల్ మిల్స్ 30, మహేంద్ర సింగ్ ధోనీ బి క్రిస్ జోర్డాన్ 5, హార్దిక్ పాండ్య రనౌట్ 2, అమిత్ మిశ్రా రనౌట్ 0, జస్‌ప్రీత్ బుమ్రా 0 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 4, మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 144.
వికెట్ల పతనం: 1-30, 2-56, 3-69, 4-125, 5-139, 6-143, 7-144, 8-144.
బౌలింగ్: లియామ్ డాసన్ 2-0-20-0, టైమల్ మిల్స్ 4-0-36-1, క్రిస్ జోర్డాన్ 4-0-22-3, బెన్ స్టోక్స్ 3-0-21-0, మోయిన్ అలీ 4-0-20-1, అదిల్ రషీద్ 3-0-24-1.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్: జాసన్ రాయ్ సి సురేష్ రైనా బి ఆశిష్ నెహ్రా 10, సామ్ బిల్లింగ్స్ సి జస్‌ప్రీత్ బుమ్రా బి ఆశిష్ నెహ్రా 12, ఇయాన్ మోర్గాన్ సి హార్దిక్ పాండ్య బి అమిత్ మిశ్రా 17, జో రూట్ ఎల్‌బి జస్‌ప్రీత్ బుమ్రా 38, ఇయాన్ మోర్గాన్ సి హార్దిక్ పాండ్య బి అమిత్ మిశ్రా 38, బెన్ స్టోక్స్ ఎల్‌బి ఆశిష్ నెహ్రా 38, జొస్ బట్లర్ బి జస్‌ప్రీత్ బుమ్రా 15, మోయిన్ అలీ 1 నాటౌట్, క్రిస్ జోర్డాన్ 0 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 8, మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 139.
వికెట్ల పతనం: 1-22, 2-22, 3-65, 4-117, 5-137, 6-138.
బౌలింగ్: యుజువేంద్ర చాహల్ 4-0-33-0, ఆశిష్ నెహ్రా 4-0-28-3, జస్‌ప్రీత్ బుమ్రా 4-0-20-2, అమిత్ మిశ్రా 4-0-25-1, సురేష్ రైనా 4-0-30-0.

చిత్రం..భారత టాప్ స్కోరర్ (71)