క్రీడాభూమి

ఉత్తమ పాలనకు కృషి చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిసిసిఐలో ఉత్తమ పాలనకు కృషి చేస్తాం. సుప్రీం కోర్టు మాకు అప్పగించిన బాధ్యత ఇదే. దీనినే మా కమిటీ ఎలాంటి పొరపాట్లు లేకుండా సక్రమంగా నిర్వర్తిస్తుంది. దేశ అత్యున్నత న్యాయస్థానం నన్ను ఈ పనికి ఎంపిక చేయడం ఎంతో ఆనందంగా ఉంది. దీనిని నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. బిసిసిఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి, కోశాధికారి అనిరుద్థ్ చౌదరితో చర్చించిన తర్వాతే ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉంటుంది. క్రికెట్ పాలనా వ్యవహారాలను చూడాల్సి రావడం నాకు ఇదే మొదటిసారి. ఇంత వరకూ ఇందులో నాకు ఎలాంటి అనుభవం లేదు. కాబట్టి, నాకు తెలియని విషయాలపై ఇప్పుడే మాట్లిడలేను. ముందుగా, కమిటీలోని మిగతా సభ్యులతో చర్చిస్తా. అప్పుడే బోర్డు వ్యవహారాలపై నాకు ఒక అవగాహన వస్తుంది. బోర్డు తీరుతెన్నులు, గతంలో జరిగిన పాలనా విధానం వంటి అంశాలను పరిశీలిస్తాం. ఎలాంటి సమాచారంగానీ, అవగాహనగానీ లేకుండా ఇప్పుడే బోర్డు వ్యవహారాలను గురించి మాట్లాడడంలో అర్థం ఉండదు.
- విక్రం లిమాయే