క్రీడాభూమి

ఆనందంగా స్వీకరిస్తాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిసిసిఐ పాలక మండలి సభ్యుడిగా సుప్రీం కోర్టు అప్పగించిన బాధ్యతను ఆనందంగా స్వీకరిస్తాను. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టడానికి నేను ప్రయత్నిస్తాను. అయితే, ఈ విషయంలో ఎక్కువగా మాట్లాడలేను. బోర్డు పాలనా వ్యవహారాలు, ఇతర అంశాలను గురించి స్పష్టమైన అవగాహన లేకుండా మాట్లాడడం సబబు కాదు. కాబట్టి నాకు అప్పగించిన బాధ్యతపై నేను ఇప్పుడే ఎలాంటి వ్యాఖ్యలు చేయలేను. అయితే, సుప్రీం కోర్టు నాకు ఎలాంటి బాధ్యతను అప్పగించినా దానిని కాదనే ప్రసక్తే లేదు. బిసిసిఐ పాలనాధికారుల్లో ఒకడిగా నన్ను ఎంపిక చేసింది కాబట్టి, ఆ బాధ్యతను సంతోషంగా స్వీకరిస్తాను. నా వంతు పాత్రను పోషిస్తాను. బోర్డు పాలనా వ్యవహారాలు సజావుగా సాగడానికి నేను, నా సహచరులు కృషి చేస్తాం. దేశంలో క్రికెట్‌ను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తాం.
- రామచంద్ర గుహ