క్రీడాభూమి

ఆరేళ్ల తర్వాత ముకుంద్‌కు చోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జనవరి 31: తమిళనాడు ఓపెనర్ అభినవ్ ముకుంద్‌కు దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్లీ టీమిండియాలో స్థానం లభించింది. బంగ్లాదేశ్‌తో ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఏకైక టెస్టు క్రికెట్ మ్యాచ్‌లో తలపడేందుకు 16 మంది సభ్యులతో ఎంపిక చేసిన భారత జట్టులో బ్యాకప్ ఓపెనర్‌గా అతనికి చోటు కల్పించారు. మంగళవారం న్యూఢిల్లీలో సమావేశమైన సెలెక్షన్ కమిటీ తీవ్రమైన హైడ్రామా నడుమ ఈ జట్టును ఎంపిక చేసింది. ముందుగా నిర్ణయించిన సమయం కంటే దాదాపు 6 గంటలు ఆలస్యంగా ఈ సమావేశం జరిగింది. అడ్మినిస్ట్రేటర్లతో కూడిన కొత్త కమిటీ (సిఓఎ) ఈ సమావేశాన్ని నిర్వహించకుండా సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరిని అడ్డుకోవడమే ఇందుకు కారణం. దీంతో ఈ వ్యవహారంపై సెలెక్షన్ కమిటీ సభ్యులకు, బిసిసిఐ పెద్దలకు మధ్య జోరుగా ఫోన్ కాల్స్, ఇ-మెయిళ్లు సాగాయి. ఆ తర్వాత బిసిసిఐ సిఇఓ రాహుల్ జోహ్రి ఈ సమావేశాన్ని నిర్వహించారు.
ఇక జట్టు కూర్పు విషయానికి వస్తే.. పార్థివ్ పటేల్‌కు బదులుగా వృద్ధిమాన్ సాహా ఈ జట్టులో వికెట్‌కీపర్‌గా స్థానాన్ని పదిలం చేసుకోవడంతో ముకుంద్‌కు అదనపు సభ్యుడిగా చోటు కల్పించారు. 2011లో వెస్టిండీస్‌తో పాటు ఇంగ్లాండ్‌లో పర్యటించిన ముకుంద్ ఆ తర్వాత టీమిండియాలో స్థానం కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల రంజీ ట్రోఫీ టోర్నమెంట్‌లో తమిళనాడు జట్టు తరఫున ఆడిన ముకుంద్ నిలకడగా రాణించి 700 పైగా పరుగులు సాధించడంతో దాదాపు ఆరేళ్ల తర్వాత అతనికి మళ్లీ జాతీయ జట్టులో చోటు లభించింది. అలాగే గాయాల నుంచి కోలుకున్న అజింక్యా రహానే, జయంత్ యాదవ్, హార్దిక్ పాండ్య మళ్లీ అందుబాటులోకి రావడంతో భారత జట్టులో పెద్దగా మార్పులేమీ చేయలేదు. మురళీ విజయ్, లోకేష్ రాహుల్, చటేశ్వర్ పుజారా, కరుణ్ నాయర్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలతో పాటు పేసర్ల త్రయం ఇశాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్‌లను ఆటోమ్యాటిక్‌గా జట్టులో చేర్చుకున్న సెలెక్టర్లు అదనపు స్పిన్నర్‌గా అమిత్ మిశ్రాను తీసుకున్నారు.
ఇదీ జట్టు
విరాట్ కోహ్లీ (కెప్టెన్), లోకేష్ రాహుల్, మురళీ విజయ్, చటేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, కరుణ్ నాయర్, హార్దిక్ పాండ్య, వృద్ధిమాన్ సాహా (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అమిత్ మిశ్రా, ఇశాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, అభినవ్ ముకుంద్.

చిత్రం..ముకుంద్