క్రీడాభూమి

క్రికెట్‌లో అలాంటివి సహజమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జనవరి 31: నాగపూర్‌లో జరిగిన రెండో టి-20 మ్యాచ్‌లో అంపైరింగ్‌పై ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అభ్యంతరాలు వ్యక్తం చేయడాన్ని టీమిండియా యువ పేస్‌బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా తేలిగ్గా కొట్టివేసాడు. క్రికెట్‌లో అంపైర్ల నిర్ణయాలు ఎప్పుడూ ఒకే పక్షానికి అనుకూలంగా ఉండవని అతను అంటూ, ఇరుపక్షాలు కూడా దాన్ని మరిచిపోయి ముందుకు సాగాలని అభిప్రాయ పడ్డాడు. ‘అంపైర్లు చేసే నిర్ణయాలపై మేము ఎక్కువగా దృష్టిపెట్టకూడదు. ఎందుకంటే అవి ఒక్కోసారి మాకు అనుకూలంగా వస్తే కొన్ని సార్లు ఎదుటి వారికి అనుకూలంగా ఉంటాయి. క్రికెట్‌లో అది సాధారణం. అందువల్ల మేము ఆటపైనే దృష్టిపెట్టి ముందుకు సాగాలి’ అని బుమ్రా మంగళవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. అంపైరింగ్ నాణ్యతపై మోర్గాన్ అసంతృప్తి గురించి విలేఖరులకు అడిగిన ప్రశ్నకు సమాధానంగా బుమ్రా ఈ విషయం చెప్పాడు. నాగపూర్‌లో జరిగిన రెండో టి-20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ అయిదు పరుగుల తేడాతో ఓడిపోవడం తెలిసిందే. బుమ్రా వేసిన చివరి ఓవర్ తొలి బంతికే ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ జో రూట్‌ను ఎల్‌బిడబ్ల్యుగా అంపైర్ ప్రకటించడం తెలిసిందే. అయితే బంతి ముందు బ్యాట్‌కు తాకి ఆ తర్వాత ప్యాడ్స్‌కు తాకినట్లు రీప్లేలో స్పష్టంగా కనిపించింది. కాగా, అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంతో అనుభవం ఉన్న సీనియర్ బౌలర్ ఆశిష్ నెహ్రా మార్గదర్శకత్వం తనకు ఎంతగానో ఉపయోగించినట్లు బుమ్రా చెప్పాడు. తాను నెహ్రాతో కలిసి కొన్ని మ్యాచ్‌లు ఆడానని, అతని మార్గదర్శకత్వం ఎప్పుడూ విలువైందని, ఎందుకంటే నెహ్రా చాలా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడని, తన అనుభవాన్ని మాతో పంచుకునే స్థితిలో ఉన్నాడని బుమ్రా చెప్పాడు.