క్రీడాభూమి

మెరో విజయంపై గురి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జనవరి 31: భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల అంతర్జాతీయ ట్వంటీ-20 క్రికెట్ సిరీస్‌లో కీలకమైన చివరి మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చేందుకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం సిద్ధమైంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌లలో ఇరు జట్లు చెరో విజయాన్ని అందుకుని సమ ఉజ్జీలుగా నిలిచిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో బుధవారం జరుగనున్న నిర్ణాయక పోరులో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకునేందుకు ఇటు భారత జట్టు, అటు ఇంగ్లాండ్ జట్టు గట్టి తహతహలాడుతున్నాయి. దీంతో హోరాహోరీగా సాగుతుందని భావిస్తున్న ఈ మ్యాచ్ ద్వారా అభిమానులకు మంచి క్రికెట్ విందు లభించడం ఖాయమని విశే్లషకులు స్పష్టం చేస్తున్నారు. ఈ సిరీస్‌కు ముందు ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్‌కు 4-0 తేడాతో విజయాన్ని అందించిన కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆ తర్వాత పొట్టి ఫార్మాట్ సారథ్య బాధ్యతలను కూడా చేపట్టి తొలి వనే్డ సిరీస్‌లోనే 2-1 తేడాతో పర్యాటక జట్టును ఓడించిన విషయం విదితమే. ఇదే జోరుతో ఇప్పుడు టి-20 సిరీస్‌లో కూడా ఇదే ఫలితాన్ని పునరావృతం చేసేందుకు బుధవారం జరుగే చివరి మ్యాచ్‌లో వరుసగా మరోసారి ఇంగ్లాండ్‌ను ఓడించి గతంలో ఎన్నడూ లేనంత అద్భుతమైన రీతిలో ఈ శీతాకాలాన్ని ఘనంగా ముగించాలని కోహ్లీ సేన ఉవ్విళ్లూరుతోంది.
ఈ సిరీస్ తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించినప్పటికీ నాగ్‌పూర్‌లో జరిగిన రెండో టి-20లో చక్కటి పోరాట పటిమ కనబర్చిన భారత జట్టుకు యువ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా అద్భుత ప్రదర్శనతో విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు విజయానికి ఆమడ దూరంలో బొక్కబోర్లా పడటం ఆ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. దీంతో తమ జట్టు స్వదేశానికి తిరిగి వెళ్లడానికి ముందు బుధవారం జరిగే నిర్ణాయక పోరులో కోహ్లీ సేనను ఓడించి కనీసం ట్వంటీ-20 సిరీస్‌తోనైనా పరువు నిలబెట్టుకోవాలని ఆశిస్తున్నాడు. అయితే కెప్టెన్‌గా స్వదేశంలో ఇప్పటివరకూ ఏ ఫార్మాట్‌లోనూ ఓటమి ఎరుగని కోహ్లీ ఇప్పుడు చిన్నస్వామి స్టేడియంలో మరోసారి ఇంగ్లాండ్‌ను ఓడించి టి-20 సిరీస్ టైటిల్‌ను కూడా తమ ఖాతాలో జమ చేసుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు. భారత్‌కు అద్భుతమైన జ్ఞాపకాలను అందించిన చిన్నస్వామి స్టేడియంలో టీమిండియా గత ఏడాది ప్రపంచ కప్ టి-20 ప్రపంచ కప్ టోర్నీ సందర్భంగా బంగ్లాదేశ్ జట్టును ఒక్క పరుగు తేడాతో ఓడించింది. గత ఏడాది మార్చి నెలలో అందుకున్న ఈ విజయంతో పాటు గత ఆదివారం నాగ్‌పూర్‌లో ఇంగ్లాండ్‌పై సాధించిన విజయం ద్వారా కొత్త ఉత్సాహాన్ని కూడగట్టుకున్న భారత జట్టు ఎంతో ప్రశాంతంగా ఉంది.
విజయం కోసం ఎటువంటి మ్యాచ్‌నైనా మలుపుతిప్పేందుకు అవసరమైన రీతిలో బౌలింగ్ చేయగలిగే విలువైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్న బుమ్రా నాగ్‌పూర్ మ్యాచ్‌లో చక్కగా రాణించడం, ప్రత్యేకించి ప్రత్యర్థులు సాధారణంగా భారీ షాట్లకు ప్రయత్నించే చివరి రెండు (18, 20) ఓవర్లలో బుమ్రా అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇవ్వడం అతని ప్రతిభకు తాజా నిదర్శనంగా నిలిచింది. ఈ మ్యాచ్ చివరి ఓవర్‌లో ఇంగ్లాండ్ జట్టు విజయానికి 8 పరుగుల దూరంలో ఉన్న కీలక తరుణంలో బుమ్రా వేసిన మొదటి బంతిని ఎదుర్కోబోయి జో రూట్ లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరగడం ఆట ఫలితాన్ని అకస్మాత్తుగా మార్చేసింది. అయితే జో రూట్ విషయంలో అంపైర్ చెట్టితోడి షంషుద్దీన్ తప్పుడు నిర్ణయం తీసుకున్నారని, బుమ్రా వేసిన బంతికి రూట్ అవుట్ కాకపోయినప్పటికీ అవుటైనట్టు ప్రకటించాడని వాదిస్తున్న ఇంగ్లాండ్ జట్టు ఈ వ్యవహారాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఇరు జట్ల మధ్య పోరు చాలా హాట్ హాట్‌గా సాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయ.

చిత్రం..చిన్నస్వామి స్టేడియంలో భారత ఆటగాళ్లు సాధన