క్రీడాభూమి

మిల్లర్, డుప్లెసిస్ శతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్బన్, ఫిబ్రవరి 2: శ్రీలంకతో జరిగిన రెండో వనే్డ ఇంటర్నేషనల్‌లో డేవిడ్ మిల్లర్, ఫఫ్ డుప్లెసిస్ శతకాలతో కదం తొక్కడంతో దక్షిణాఫ్రికా 121 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఈ జట్టు 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 307 పరుగులు చేసింది. మిల్లర్ 98 బంతుల్లోనే 117 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. డుప్లెసిస్ 120 బంతులు ఎదుర్కొని 105 పరుగులు చేశాడు. లంక బౌలర్లలో సురంగ లక్మల్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లంక 37.5 ఓవర్లలో 186 పరుగులకే కుప్పకూలింది. 36 పరుగులు సాధించిన వికెట్‌కీపర్ దినేష్ చండీమల్ టాప్ స్కోరర్‌గా నిలిచాడంటే, లంక బ్యాటింగ్ వైఫల్యం ఏ స్థాయిలో కొనసాగిందో ఊహించుకోవచ్చు. దక్షిణాఫ్రికా బౌలర్లలో వేన్ పార్నెల్, ఇమ్రాన్ తాహిర్, జెపి డుమినీ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
సంక్షిప్త స్కోర్లు
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: 50 ఓవర్లలో 6 వికెట్లకు 307 (్ఫఫ్ డుప్లెసిస్ 105, డేవిడ్ మిల్లర్ 117 నాటౌట్, సురంగ లక్మల్ 2/54).
శ్రీలంక ఇన్నింగ్స్: 35.5 ఓవర్లలో 186 ఆలౌట్ (దినేష్ చండీమల్ 36, ఉపల్ తరంగ 26, నిరోషన్ డిక్‌విల్లా 25, వేన్ పార్నెల్ 2/34, ఇమ్రాన్ తాహిర్ 2/26, జెపి డుమినీ 2/30).

లంకతో జరిగిన రెండో వనే్డలో అజేయ శతకంతో రాణించిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ డేవిడ్ మిల్లర్. కాగా, ఈ మ్యాచ్ ఆడుతున్నప్పుడు గాయపడి ఈ డేర్ డెవిల్ లంకతో జరిగే మిగతా మూడు వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడు

చిత్రం.. డేవిడ్ మిల్లర్