క్రీడాభూమి

రికార్డుకు చేరువలో పేస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణే, ఫిబ్రవరి 2: భారత వెటరన్ టెన్నిస్ స్టార్, 43 ఏళ్ల లియాండర్ పేస్ మరో రికార్డును సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు. గురువారం నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభమయ్యే డేవిస్ కప్ పోరులో విష్ణువర్ధన్ భాగస్వామిగా అతను డబుల్స్ విభాగంలో పోటీపడతాడు. ఇప్పటికే డేవిస్ కప్‌లో ఎక్కువ కాలం ఆడిన ఆటగాడిగా పేస్ రికార్డు సృష్టించాడు. అతను 25 సంవత్సరాలుగా ఈ పోటీల్లో ఆడుతున్నాడు. ఇంత వరకూ డబుల్స్ విభాగంలో 42 విజయాలు సాధించాడు. మరో మ్యాచ్‌ని గెలిస్తే, డేవిస్ కప్ చరిత్రలోనే అత్యధిక డబుల్స్ మ్యాచ్‌లు గెల్చుకున్న ఆటగాడిగా మరో రికార్డు సృష్టిస్తాడు. వాస్తవానికి అతను డబుల్స్‌లో సాకేత్ మైనేనితో కలిసి మ్యాచ్ ఆడాల్సి ఉంది. కానీ, సాకేత్ గాయం నుంచి కోలుకోకపోవడంతో, అతనికి భాగస్వామిగా జాతీయ చాంపియన్ విష్ణువర్ధన్‌ను ఎంపిక చేశారు.

చిత్రం..లియాండర్ పేస్