క్రీడాభూమి

డింకోకు అండగా నిలుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ, ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న భారత మాజీ బాక్సర్, ఆసియా క్రీడల పతక విజేత డింకో సింగ్‌కు అండగా నిలుస్తామని కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ హామీ ఇచ్చారు. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ (ఎయిమ్స్)లో చికిత్స పొందుతున్న డింకో సింగ్ వైద్యానికయ్యే ఖర్చులను చెల్లించలేక, ఇటీవలే ఇంటిని అమ్మేశాడని వచ్చిన వార్తలపై గోయల్ స్పందించారు. భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) అధికారులను ఇప్పటికే డింకో సింగ్ వద్దకు పంపామని, అతనికి అన్ని విధాలా సహాయసహకారాలు అందిస్తామని తెలిపారు. క్రీడలకు ఇతోథిక ప్రాధా న్యం ఇస్తున్నామని అన్నారు.