క్రీడాభూమి

ఆసియా కప్ క్వాలిఫయర్స్ సులభం కావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: పేపర్‌పై చూస్తే పటిష్టంగానే కనిపిస్తున్నప్పటికీ, మైదానంలో పరిస్థితులు ఎటువైపు మొగ్గు చూపుతాయో ఊహించడం కష్టమని, నిజానికి పోటీల్లో సులభమైన మ్యాచ్‌లు అంటూ ఏవీ ఉండవని భారత ఫుట్‌బాల్ జాతీయ కోచ్ స్టెఫెన్ కాన్‌స్టాంటిన్ ఆటగాళ్లకు స్పష్టం చేశాడు. 2019లో జరిగే ఆసియా కప్ కోసం వచ్చే నెల నుంచి క్వాలిఫయర్స్ మొదలవుతాయని, ఇందులో ప్రతి మ్యాచ్ అత్యంత కీలకమని అతను బుధవారం పిటిఐతో మాట్లాడుతూ అన్నాడు. కిర్గిజ్ రిపబ్లిక్, మైన్మార్, మకావూతోపాటు భారత్ గ్రూప్ ‘ఎ’ నుంచి పోటీపడుతున్న విషయాన్ని అతను ప్రస్తావిస్తూ, క్వాలిఫయర్స్‌లో భారత్ హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగుతున్నదని చెప్పాడు. అయితే, మిగతా జట్లను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని అన్నాడు. నిరుడు ప్రపంచ కప్ ఫుట్‌బాల్ క్వాలిఫయర్స్‌లో భారత్ అట్టడుగు స్థానంలో నిలవడం తనను నిరాశకు గురి చేసిందని కాన్‌స్టాంటిన్ తెలిపాడు. ఆసియా కప్ క్వాలిఫయర్స్‌లో అద్భుతంగా రాణించడం ద్వారా జట్టు మళ్లీ ఫామ్‌లోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. కాగా, భారత జట్టు ఆసియా కప్ ఫుట్‌బాల్ టోర్నీలో చివరిసారి 2011లో పాల్గొంది. ఆతర్వాత ఈ మేజర్ టోర్నీకి అర్హత సంపాదించలేకపోయింది. ఈసారి క్వాలిఫయర్స్‌లో పాల్గొనడం ద్వారా మెయిన్ డ్రాకు అర్హత సంపాదించాలన్న పట్టుదలతో ఉంది.

చిత్రం..స్టెఫెన్ కాన్‌స్టాంటిన్