క్రీడాభూమి

భారత్ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 3: అండర్-19 క్రికెట్ సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మూడో వనే్డలోనూ ఇంగ్లాండ్‌ను ఓడించిన భారత్ 2-1 ఆధిక్యాన్ని సంపాదించింది. మొదటి మ్యాచ్‌లో నెగ్గిన ఇంగ్లాండ్‌ను ఆతర్వాత కట్టడి చేసిన భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేయడం విశేషం. ఓపెనర్ శుభమ్ గిల్ అజేయ శతకంతో రాణించి, ఇంగ్లాండ్‌పై భారత్ 7 వికెట్ల తేడాతో గెలవడంలో ప్రధాన భూమిక పోషించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ 49 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు హెన్రీ బ్రూక్స్ (12), మాక్స్ హోల్డెన్ (8) విఫలమైనప్పటికీ మిడిల్ ఆర్డర్‌లో డెల్‌రే రాలిన్స్, జార్జి బార్ట్‌లెట్ అర్ధ శతకాలు నమోదు చేయడంతో ఇంగ్లాండ్ ఊపిరి పీల్చుకుంది. కానీ, బార్ట్‌లెట్ 67 బంతుల్లో 55 పరుగులు చేసి అవుట్‌కాగా, ఆతర్వాత కూడా పోరాటాన్ని కొనసాగించి, 106 బంతుల్లో, 11 ఫోర్లు, రెండు సిక్సర్లతో 96 పరుగులు సాధించిన రాలిన్స్ కూడా వెనుదిరగడంతో ఇంగ్లాండ్ ప్రతిఘటనకు దాదాపు తెరపడింది. రాలిన్స్ దురదృష్టవశాత్తు నాలుగు పరుగుల తేడాతో సెంచరీని కోల్పోయాడు. భారత బౌలర్లలో రాహుల్ దేశ్‌రాజ్ చాహర్ 33 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టాడు. అనుకుల్ రాయ్ 39 పరుగులకు మూడు వికెట్లు సాధించాడు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్ శుభమ్ గిల్ అండా నిలిచాడు. కెప్టెన్ హిమాంశు రాణా (19), ప్రియమ్ గార్గ్ (8), సల్మాన్ ఖాన్ (11) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరడంతో కష్టాల్లో పడిన జట్టుకు హార్విక్ దేశాయ్ (37 నాటౌట్)తో కలిసి శుభమ్ గిల్ విజయాన్ని సాధించిపెట్టాడు. అతను 157 బంతులు ఎదుర్కొని, 17 ఫోర్లు, 2 సిక్సర్లతో 138 పరుగులు సాధిం చి నాటౌట్‌గా నిలిచాడు. ఇంకా 35 బంతులు మిగిలి ఉండగానే, భారత్ 44.1 ఓవర్లలో 216 పరుగులు సాధించి, 7 వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లాండ్ అండర్-19 ఇన్నింగ్స్: 49 ఓవర్లలో 215 ఆలౌట్ (డెల్‌రే రాలిన్స్ 96, జార్జి బార్ట్‌లెట్ 55, రాహుల్ దేశ్‌రాజ్ చాహర్ 4/33, అనుకుల్ రాయ్ 3/39).
భారత్ అండర్-19 ఇన్నింగ్స్: 44.1 ఓవర్లలో 3 వికెట్లకు 216 (శుభమ్ గిల్ 138 నాటౌట్, హార్విక్ దేశాయ్ 37 నాటౌట్, రాలిన్స్ 2/30).

చిత్రం..అజేయ శతకం.. శుభమ్ గిల్