క్రీడాభూమి

బంగ్లాదేశ్‌తో పోరుకు భారత్ ‘ఎ’ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 4: బంగ్లాదేశ్‌తో ఆదివారం నుంచి ప్రారంభమయ్యే రెండు రోజుల వామప్ మ్యాచ్‌లో గట్టిపోటీనిచ్చేందుకు అభినవ్ ముకుంద్ నాయకత్వంలో భారత్ ‘ఎ’ జట్టు సిద్ధంగా ఉంది. గాయాల కారణంగా విశ్రాంతి తీసుకొని, ముస్తాక్ అలీ టోర్నీలో హర్యానా తరఫున ఆడిన జాతీయ జట్టు ఆటగాడు జయంత్ యాదవ్ ఫిట్నెస్‌కు ఈ మ్యాచ్ పరీక్షగా మారనుంది. అదే విధంగా ఆల్‌రౌండర్‌గా ఎదుగుతున్న మరో ఆటగాడు హార్దిక్ పాండ్య ఈ మ్యాచ్‌లో స్టార్ అట్రాక్షన్‌గా నిలవనున్నాడు. వీరిద్దరితోపాటు అభినవ్ ముకుంద్ కూడా జాతీయ టెస్టు జట్టు సభ్యుడే. ముష్ఫికర్ రహీం నాయకత్వంలోని బంగ్లాదేశ్‌తో జరిగే రెండు రోజుల వామప్ మ్యాచ్‌లో వారికి తగినంత ప్రాక్టీస్ లభించనుంది. బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టు ఇక్కడి ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈనెల 9 నుంచి 13వ తేదీ వరకు జరుగుతుంది. బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు ఏ స్థాయిలో పోటీ ఉంటుందో చెప్పలేకపోయినా, ఆతర్వాత ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఈనెలాఖరు నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఆటగాళ్లందరికీ ప్రాక్టీస్ అత్యవసరంగా మారింది. కాగా, ఇంగ్లాండ్‌కు గట్టిపోటీనిచ్చిన బంగ్లాదేశ్ ఇప్పుడు భారత్‌పైన కూడా సత్తా చాటాలన్న పట్టుదలతో ఉంది. ఇమ్రుల్ కయాస్, తమీమ్ ఇక్బాల్, మోనిముల్ హక్, తస్కిన్ అహ్మద్ వంటి మేటి ఆటగాళ్లతో కూడిన ఈ జట్టు రెండు రోజుల వాపమ్ మ్యాచ్ ద్వారా సాధ్యమైనంత ఎక్కువ ప్రాక్టీస్‌కు ప్రయత్నించనుంది. భారత్ ‘ఎ’ జట్టులో ముకుంద్, హార్దిక్ పాండ్య, జయంత్ యాదవ్ టీమిండియాకు ప్రాతినిథ్యం వహిస్తుండగా, టెస్టు ఫార్మాట్‌లోనూ అడుగుపెట్టేందుకు రిషభ్ పంత్ పోటీపడుతున్నాడు. సమర్థుడైన వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్‌గా ఇప్పటికే పేరు తెచ్చుకున్న అతను ధోనీకి తగిన వారసుడిగా ముద్రపడ్డాడు. అయితే, వామప్ మ్యాచ్‌లో కీపింగ్ బాధ్యతలను ఇషాన్ కిషన్ స్వీకరిస్తాడు. అతను కూడా మంచి బ్యాట్స్‌కావడంతో, యువ ఆటగాళ్ల మధ్య ఆసక్తికరమైన పోరు నెలకొంది.

చిత్రం..వామప్‌లో భాగంగా శనివారం ఫుట్‌బాల్ ఆడుతున్న భారత్ ‘ఎ’ ఆటగాళ్లు