క్రీడాభూమి

బిసిసిఐకి ఎదురుదెబ్బ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, ఫిబ్రవరి 4: అత్యధిక ఆదాయ వనరులతో ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)కి ఎదురుదెబ్బ తగిలినట్టు సమాచారం. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఆదాయంలో సింహ భాగాన్ని తీసుకుంటున్న బిసిసిఐకు దిమ్మతిరిగేలా ఇక్కడి సమావేశంలో సభ్య దేశాలు తీర్మానాన్ని ఆమోదించినట్టు తెలుస్తున్నది. ఐసిసి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, ‘బిగ్ త్రీ’ దేశాలు అత్యధిక వాటాను తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్న దేశాల సంఖ్య క్రమంగా పెరిగింది. దీనితో వాటాల దామాషాను సమీక్షించి, కొత్త రూపాన్ని ఇవ్వాలని ఐసిసి అధ్యక్షుడు శశాంక్ మనోహర్ నిర్ణయించాడు. ‘బిగ్ త్రీ’ దేశాల ఆధిపత్యానికి తెర పడాలంటూ అతను గతంలో చేసిన ప్రకటనను బిసిసిఐ తీవ్రంగా వ్యతిరేకించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్రతిపాదనలను కార్యరూపంలోకి తీసుకురావాడానికి వీల్లేదంటూ మండిపడింది. కానీ, ఐసిసి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత బిసిసిఐతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్న మనోహర్ చివరికి తాను అనుకున్నదే చేశాడు. ఇక్కడ జరుగుతున్న ఐసిసి సమావేశాల్లో మిగతా అంశాలతోపాటు ఆదాయ పంపకాన్ని సమీక్షించడాన్ని కూడా ఎజెండాలో చేర్చాడు.
గత ఎనిమిదేళ్లుగా ఐసిసి సంపాదించిన ఆదాయంలో ‘బిగ్ త్రీ’ దేశాలకు అత్యధిక వాటా దక్కాలన్న డిమాండ్‌ను భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులు నెగ్గించుకున్నాయి. 2014లో చేసిన తీర్మానంలో బిసిసిఐకి 20.3 శాతం వాటాను ఖాయం చేశారు. అదే విధంగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఇసిబి)కి 4.4 శాతం, క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ)కు 2.7 శాతం ఇవ్వాలని ఐసిసి అప్పట్లో తీర్మానించింది. అంటే ఐసిసి ఆదాయంలో 27.4 శాతం ‘బిగ్ త్రీ’ దేశాల ఖాతాల్లోకే వెళ్లిపోతుంది. బిసిసిఐ మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ఐసిసి చైర్మన్‌గా ఎన్నికైన తర్వాత ఆదాయ వాటాల్లో కనిపిస్తున్న వ్యత్యాసానికి తెరించాలని నిర్ణయించాడు. అందుకు తగ్గట్టుగానే పావులు కదిపాడు. చివరికి ఐసిసి వాటాల పునర్ వ్యవస్థీకరణ తీర్మానాన్ని ఆమోదించిందని సమాచారం.
ఐసిసి పునర్ వ్యవస్థీకరణ పేరుతో తీసుకున్న నిర్ణయాల పట్ల నిరసనలు వెల్లువెత్తుత్తిన విషయం తెలిసిందే. ‘బిగ్ త్రీ’ దేశాలకు ఐసిసిలోని వాణిజ్య హక్కుల విభాగాన్ని అప్ప చెప్పాలని ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల కమిటీ చేసిన సూచనకు అప్పట్లో ఆమోదముద్ర పడింది. ఈ కమిటీలో నలుగురు సభ్యులు ఉండాలని, వాటిలో మూడింటిని ‘బిగ్ త్రీ’తో భర్తీ చేస్తే, మరో సభ్యుడిని ఈ మూడు దేశాలు అంగీకారంతో నియమించాలని ఐసిసి తీర్మానించింది. స్థూలంగా చెప్పాలంటే, ఐసిసి ఆర్థిక వ్యవహారాలన్నీ ‘బిగ్ త్రీ’ దేశాల చేతుల్లోకి వెళ్లిపోయాయ. కాగా, ‘బిగ్ త్రీ’ వ్యవహారంపై వివిధ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రతిపాదనను తక్షణమే ఉపసంహరించుకోవాలని వెస్టిండీస్ మాజీ కెప్టెన్ క్లయివ్ లాయిడ్ సహా పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఐసిసికి ఒకప్పుడు చైర్మన్‌గా, మ్యాచ్ రిఫరీగా వ్యవహరించిన లాయిడ్ ఈ ప్రతిపాదనలు మిగతా దేశాల్లో క్రికెట్ మనుగడను ప్రశ్నార్థంగా మారుస్తాయని ధ్వజమెత్తాడు. ‘బిగ్ త్రీ’ దేశాలకు ఆర్థిక పరమైన అంశాలపై పూర్తి హక్కులను ఇవ్వడం సమంజసం కాదని, ఇలాంటి ప్రతిపాదనను బుట్టదాఖలు చేయాలని ఐసిసికి రాసిన లేఖలో అతను కోరాడు. ఐసిసి మాజీ అధికారులు మాల్కం గ్రే, మాల్కం స్పీడ్ కూడా ‘బిగ్ త్రీ’ ప్రతిపాదనను తప్పుపట్టారు. మూడు దేశాల చేతుల్లోకి ఆర్థిక అంశాలు వెళ్లిపోతే ఐసిసికి విలువ ఏముంటుందని ప్రశ్నించారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ షహ్రయార్ ఖాన్, లెఫ్టినెంట్ జనరల్ తాకిర్ జియా, ఐసిసి మాజచీ చీఫ్ ఇషాన్ మణి తదితరులు కూడా ‘బిగ్ త్రీ’ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఇప్పటికే ప్రకటనలు చేశారు. ఐసిసి ఆదాయంలో అత్యధిక శాతం భారత్ నుంచి, ఆతర్వాత ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా దేశాల నుంచి వెళుతోంది. పూర్తి స్థాయి సభ్యత్వంగల మిగతా ఏడు దేశాలు ఐసిసికి సమకూర్చి పెడుతున్న మొత్తాలు దాదాపు ఏవీ లేవనే చెప్పాలి. అందుకే వాటాల్లో తమకు సింహ భాగం దక్కాలని భారత్ క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) చాలాకాలం పోరాడి తన పంతాన్ని నెరవేర్చుకుంది. ఆతర్వాతి స్థానాలు తమవి కాబట్టి, వాటాల విషయంలో తమ హక్కునూ కాపాడాలని ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి), క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) చేసిన డిమాండ్‌కు మద్దతునిచ్చి, ‘బిగ్ త్రీ’ సూత్రాన్ని అమలు చేసేలా ఐసిసిపై ఒత్తిడి తెచ్చి, సఫలమైంది. ఈ మూడు దేశాలకే వాణిజ్య హక్కుల కమిటీ బాధ్యతలను అప్పచెప్తే ఒక పెద్ద సమస్యకు తెరపడుతుందని ఎంత మంది వాదించినా, ‘బిగ్ త్రీ’ వ్యవహారం అంతర్జాతీయ క్రికెట్‌లో పెను తుపాను సృషించింది. చివరికి మూడు దేశాలకు పెద్దవాటాకు చిల్లుపడింది.

ఐసిసి వర్గాలు పిటిఐకి తెలిపిన వివరాల ప్రకారం, ఐసిసి ఆదాయంలో వాటాలను మరోసారి సమీక్షించాలన్న ప్రతిపాదనను బిసిసిఐ తరఫున ప్రతినిధిగా హాజరైన విక్రం లిమాయే వ్యతిరేకించాడు. అతనికి శ్రీలంక క్రికెట్ బోర్డు నుంచి మాత్రమే బిసిసిఐకి మద్దతు లభించింది. జింబాబ్వే ఓటింగ్‌లో పాల్గొనలేదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, వెస్టిండీస్, న్యూజిలాండ్ దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. భారత్‌తోపాటు ‘బిగ్ త్రీ’లో ఉన్న ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా కూడా బిసిసిఐ అభ్యంతరాలను వినకుండా, తీర్మానానికి అనుకూలంగా స్పందించడం విశేషం. అయతే, బిసిసిఐ చివరి క్షణం వరకూ ఈ ప్రతిపాదనకు ఆమోద ముద్ర పడకుండా ప్రయత్నించిందని, కానీ, పునః సమీక్షించాలన్న సూచనకే ఎక్కువ దేశాలు మొగ్గు చూపాయని తెలిసింది.