క్రీడాభూమి

టి-20 వరల్డ్ కప్ దండగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, ఫిబ్రవరి 1: టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ పోటీల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, అది శుద్ధ దండగని ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ ర్యాన్ హారిస్ అభిప్రాయపడ్డాడు. టి-20 ఫార్మెట్‌లో ఎక్కువగా మ్యాచ్‌లు ఆడని జట్లు పోటీపడుతున్న కారణంగా, ఈమెగా టోర్నీ వల్ల సమయం వృథా అవుతుందే తప్ప లాభమేమీ ఉండదని ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. ఆస్ట్రేలియా, భారత్‌సహా చాలా జట్లు టి-20 మ్యాచ్‌లు ఎక్కువగా ఆడడం లేదన్నాడు. గత ఏడాది ఆస్ట్రేలియా కేవలం ఒకేఒక టి-20 సిరీస్‌ను ఇంగ్లాండ్‌తో ఆడిన విషయాన్ని అతను గుర్తుచేశాడు. ఈఏడాది వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకొని, దక్షిణాఫ్రికా, భారత్‌తో టి-20 సిరీస్‌ల్లో పాల్గొందన్నాడు. టెస్టు, వనే్డల మాదిరి టి-20 ఇంటర్నేషనల్ సిరీస్‌లు జరగాలని సూచించాడు. ఆ విధంగా జరగకపోతే, వరల్డ్ కప్ పోటీల వల్ల ఎవరికి ఉపయోగమని ప్రశ్నించాడు. ఒక ప్రశ్నకు సమాధానిమిస్తూ వరల్డ్ కప్‌ను ఆస్ట్రేలియా ప్రతిష్ఠాత్మకంగా స్వీకరించిందని చెప్పాడు.

పాట్నా పైరేట్స్‌కు తొలి గెలుపు

విశాఖపట్నం (స్పోర్ట్స్), ఫిబ్రవరి 1: విశాఖలో జరుగుతున్న ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్‌లో సోమవారం జైపూర్ పింక్ పాంథర్స్, పాట్నా పైరేట్స్ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మ్యాచ్ ఆరంభం నుంచి ఉత్కంఠంగా కొనసాగింది. చివరి వరకూ పోరాడిన పింక్ పాంథర్స్ కేవలం ఒక్క పాయింట్ తేడాతో పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో పాట్నా పైరేట్స్ అనూహ్య విజయాన్ని సాధించింది. మ్యాచ్ చివరి నిముషానికి 28-28 పాయింట్లతో ఇరు జట్లు సమ ఉజ్జీలుగా ఉన్నాయి. ఈ తరుణంలో జైపూర్ రైడర్ జస్వీర్ సింగ్‌ను క్యాచ్ పట్టి, పాట్నా జట్టు మరో పాయింట్ సాధించి చివరకు 29-28 పాయింట్లతో సీజన్‌లో తొలి విజయాన్ని కైవసం చేసుకుంది. స్థానిక పోర్టు రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో జైపూర్ జట్టు ఆట ప్రారంభంలో 7-5 పాయింట్ల ఆధిక్యత సాధించినప్పటికీ, పాట్నా జట్టు 9-9 పాయింట్ల వద్ద స్కోర్ సమం చేసింది. అక్కడి నుంచి 27-22 పాయింట్లతో ఆధిక్యతను సాధించుకుంటూ వచ్చిన పాట్నా జట్టును జైపూర్ జట్టు సూపర్ టాకిల్‌తో మళ్లీ పోటీలోకి వచ్చింది. పాట్నా స్టార్ రైడర్ ప్రదీవ్ నర్వాల్‌ను థర్డ్ రైడ్‌లో అంపైర్ స్టాండ్ బ్రేక్‌గా ఔట్ చేయడంతో స్కోర్ 28-26 పాయింట్లకు చేరుకుంది. జైపూర్ జట్టులోని రాజేష్ నర్వాల్ రైడింగ్‌లో పాయింట్ సాధించడం, అలాగే రాణా రోహిత్ కుమార్‌ను క్యాచ్ పట్టడంతో స్కోర్ 28-28 పాయింట్లతో సమం అయింది. చివరి నిముషంలో అప్పటి వరకూ రైడింగ్‌లో అద్భుతమైన ప్రతిభ కనబరచిన జైపూర్ రైడర్ జస్వీర్ సింగ్‌ను సురేష్ కుమార్ క్యాచ్ చేయడంతో 29-28 పాయింట్ల తేడాతో పాట్నా గెలుపొందింది. పాట్నా జట్టులో స్టార్ రైడర్ ప్రదీప్ నర్వాల్ తొమ్మిది పాయింట్లు, రోహిత్ కుమార్ నాలుగు పాయింట్లు చేశారు. డిఫెన్స్‌లో సందీప్ నర్వాల్, సురేష్ కుమార్ రాణించారు.