క్రీడాభూమి

కరాటేలో భారత్ జయకేతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), ఫిబ్రవరి 5: అంతర్జాతీయ కరాటే చాంపియన్‌షిప్ పోటీల్లో భారత జట్టు విజయకేతనం ఎగురవేసింది. పోర్టు రాజీవ్‌గాంధీ ఇండోర్ స్టేడియంలో మూడు రోజుల పాటు జరిగిన ఈ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ పోటీలకు ఆతిథ్యమిస్తున్న భారత జట్టు అత్యధికంగా 220 పాయింట్లు సాధించి ప్రథమస్థానంలో నిలువగా, 76 పాయింట్లతో శ్రీలంక జట్టు ద్వితీయ స్థానం దక్కించుకుంది. 50 పాయింట్లతో బంగ్లాదేశ్ జట్టు తృతీయ స్థానంలో నిలిచింది. పోటీల అనంతరం జరిగిన ముగింపోత్సవానికి నిర్వాహక అధ్యక్షుడు హైదర్ ఆలి అధ్యక్షత వహించగా, ఎమ్మెల్యే పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ పోటీల్లో శ్రీలంక, నేపాల్, బూటాన్, బంగ్లాదేశ్, సౌదీ, మాల్దీవులకు చెందిన 119 మంది, భారత్ నుండి 75 మంది క్రీడాకారులు పోటీ పడ్డారు.

చిత్రం..విజేత భారత్, రన్నరప్ శ్రీలంక జట్లకు ట్రోఫీల అందజేస్తున్న ఎమ్మెల్యే గణబాబు