క్రీడాభూమి

అసలు పోరుకు ముందే బంగ్లాదేశ్‌కు ఎదురుదెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 6: టీమిండియాతో ఏకైక టెస్టు మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందే బంగ్లాదేశ్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ మ్యాచ్‌కి ముందు ఇక్కడ ఇండియా-ఏ జట్టుతో సోమవారం ముగిసిన రెండు రోజుల సన్నాహక మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓపెనర్ ఇమ్రుల్ కరుూస్‌కు తొడ గాయం తిరగబెట్టడంతో అతను అసలు మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ గాయం వలన అతను గత నెల క్రైస్ట్‌చర్చ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌కు దూరమయ్యాడని, ఇప్పుడు అదే గాయం మళ్లీ తిరగబెట్టిందని, దీంతో టీమిండియాతో జరిగే టెస్టులో తమీమ్ ఇక్బాల్‌తో కలసి సౌమ్య సర్కార్ తమ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బిసిబి) మీడియా మేనేజర్ రబీద్ ఇమామ్ తెలిపాడు.

చిత్రం..ఇమ్రుల్ కరుూస్