క్రీడాభూమి

అండర్-19 యూత్ వనే్డ సిరీస్ మనదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 6: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల అండర్-19 యూత్ ఇంటర్నేషనల్ వనే్డ క్రికెట్ సిరీస్‌లో భారత్ మరోమారు సత్తా చాటింది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో సోమవారం జరిగిన నాలుగో మ్యాచ్‌లో ఆతిథ్య భారత జట్టు 230 పరుగుల భారీ తేడాతో పర్యాటక జట్టును మట్టికరిపించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ అండర్-19 కెప్టెన్ ఎండి.్ఫషర్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టులో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్లు చక్కగా రాణించారు. ప్రత్యేకించి ఓపెనర్ షబ్మన్ గిల్ (120 బంతుల్లో 160 పరుగులు), ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ పృథ్వీ షా (89 బంతుల్లో 105 పరుగులు) ప్రత్యర్థి బౌలర్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడి సెంచరీలతో హోరెత్తించారు. వీరికి తోడు కెప్టెన్ హిమాన్షు రాణా (33), అభిషేక్ శర్మ (24), మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ మయాంక్ రావత్ (14) తమవంతు రాణించినప్పటికీ మిగిలిన వారెవరూ రెండంకెల స్కోర్లు సాధించలేకపోయారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత అండర్-19 జట్టు 9 వికెట్ల నష్టానికి 382 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇంగ్లాండ్ అండర్-19 బౌలర్లలో ఎ.గొడ్సల్, డిఎండబ్ల్యు.రౌలిన్స్, హెచ్.బ్రూక్స్ రెండేసి వికెట్లు, ఎల్.పాటర్సన్-వైట్ ఒక వికెట్ రాబట్టారు.
అనంతరం భారీ లక్ష్యంతో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ అండర్-19 బ్యాట్స్‌మన్లను భారత బౌలర్లు గడగడలాడించారు. వీరి జోరును ప్రతిఘటించడంలో ఘోరంగా విఫలమైన ఇంగ్లాండ్ జట్టులో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్లు హెచ్‌సి.బ్రూక్స్ (0), జిఎ.బార్‌ట్లెట్ (0), టి.బాంటన్ (6), డిఎండబ్ల్యు.రౌలిన్స్ (9) త్వరత్వరగా పెవిలియన్‌కు పరుగెత్తగా, మిడిలార్డర్‌లో వికెట్‌కీపర్ ఓజె.పోప్ (59), ఎండిఇ.హోల్డెన్ (17), డబ్ల్యుజి.జాక్స్ (44) కొద్దిసేపు స్థిమితంగా ఆడి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే వీరి నిష్క్రమణ అనంతరం మిగిలిన వారెవరూ రెండంకెల స్కోర్లు సాధించకుండానే వెనుదిరగడంతో 37.4 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌటైన ఇంగ్లాండ్ అండర్-19 జట్టు 230 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజం పాలైంది. భారత అండర్-19 బౌలర్లలో కెఎల్.నాగర్కోటి (4/31), వి.తివారీ (3/20) నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థుల పతనాన్ని శాసించగా, శివం మావి రెండు వికెట్లు, ఆర్‌డి.చహర్ ఒక వికెట్ అందుకున్నారు.

చిత్రం..షబ్మన్ గిల్ (120 బంతుల్లో 160 పరుగులు)