క్రీడాభూమి

జోరు తగ్గదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 7: సొంత గడ్డపై ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో సాధించిన విజయాల ఊపును అలాగే కొనసాగించాలని అనుకుంటున్నామని టీమిండియా చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే స్పష్టం చేశాడు. గురువారంనుంచి హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరగనున్న టెస్టు సందర్భంగా మంగళవారం కుంబ్లే విలేఖరులతో మాట్లాడాడు. ‘ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో కనబరిచిన ఊపును అలాగే కొనసాగించాలని మేము అనుకుంటున్నాం. ఇప్పటివరకు హోమ్ సిరీస్ చాలా బాగా ఉంది. దీన్ని ఇలాగే కొనసాగిస్తామన్న నమ్మకం కూడా మాకు ఉంది. ఈ టెస్టు తర్వాత మరికొన్ని టెస్టులు కూడా ఉన్నాయి. అందువల్ల న్యూజిలాండ్‌పై ఇటీవల చాలా చక్కగా రాణించిన బంగ్లాదేశ్‌ను ఎదుర్కొన్నప్పుడు కూడా ఈ ఊపును ఇలాగే కొనసాగించడం మాకు చాలా ముఖ్యం’ అని కుంబ్లే చెప్పాడు. బంగ్లాదేశ్‌పై భిన్నంగా ఏమీ చేయాల్సిన అవసరం ఉందని తాను అనుకోవడం లేదని కుంబ్లే, తమ సొంత సామర్థ్యాన్ని అంచనా వేసుకుని, తాము ఏం సాధించాలో, ఆ లక్ష్యాలను ఎలా చేరుకోవాలో నిర్ణయించుకుంటే చాలు, తమ లక్ష్యాలను సునాయాసంగా సాధిస్తామని తాను అనుకుంటున్నానని చెప్పాడు. కాగా, బంగ్లాదేశ్ జట్టు గురించి మాట్లాడుతూ, ఆ జట్టు చాలా మెరుగయిందని, ఇటీవల న్యూజిలాండ్‌లో చాలా గొప్పగా ఆడారని అంటూ, ప్రత్యర్థిని తాము తప్పక గౌరవిస్తామన్నాడు. బంగ్లాదేశ్‌లో కొంతమంది మంచి ఆటగాళ్లు, ఆల్‌రౌండర్లున్నారని, అందువల్ల పోటీ ఆసక్తికరంగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపాడు.
కాగా, సొంతగడ్డపై ఫాస్ట్ బౌలర్లు రాణించడంపైన, ప్రత్యర్థిని రెండు సార్లు ఔట్ చేయగల బౌలర్ల సామర్థ్యం గురించి కూడా కుంబ్లే మాట్లాడాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో స్పిన్నర్ల ఆధిపత్యం గురించి అందరూ మాట్లాడుతున్నారు కానీ ఫాస్ట్ బౌలర్ల పాత్రను తేలిగ్గా తీసేయలేము. ఏది ఏమయినా ఈ జట్టుకు 20 వికెట్లు తీయగల సామర్థ్యం తప్పకుండా ఉందని కూడా కుంబ్లే చెప్పాడు. కాగా, ఓపెనింగ్ స్థానం ఎంతమాత్రం సమస్య కాదని చెప్పిన కుంబ్లే తమిళనాడు బ్యాట్స్‌మన్ అభినవ్ ముకుంద్‌ను తిరిగి జట్టులోకి తీసుకోవడం బ్యాకప్ కోసమేనని స్పష్టం చేశాడు. గత సిరీస్‌లో మురళీ విజయ్, కెఎల్ రాహుల్‌లు చాలా చక్కగా ఆడారని కూడా కితాబిచ్చాడు. కాగా, మిడిలార్డర్ పొజిషన్ల గురించి జట్టు ఆలోచించలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా కుంబ్లే తెలిపాడు. కాగా, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యకు తుది జట్టులో స్థానం కల్పించవచ్చన్న స్పష్టమైన సంకేతాలను కూడా ఇచ్చాడు.

చిత్రం..ఉప్పల్ గ్రౌండ్‌లో మంగళవారం భారత ఆటగాళ్ల సాధన