క్రీడాభూమి

నువ్వా.. నేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, ఫిబ్రవరి 7: హైదరాబాద్‌లో గురువారం నుంచి బంగ్లాదేశ్‌తో టెస్టు క్రికెట్ మ్యాచ్ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు అంతర్జాతీయ ర్యాంకింగ్స్ విషయంలో తన సహచర సభ్యుడు రవీంద్ర జడేజా నుంచి తీవ్రమైన పోటీ ఎదురుకానుంది. ఇండోర్‌లో గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో టీమిండియా 321 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను మట్టికరిపించిన నాటి నుంచి ఐసిసి ఉత్తమ బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్న అశ్విన్ ఖాతాలో ప్రస్తుతం 887 రేటింగ్ పాయింట్లు ఉండగా, అతని కంటే కేవలం 8 పాయింట్లు వెనుకబడిన రవీంద్ర జడేజా రెండో స్థానంలో నిలిచాడు. కనుక ఇప్పుడు బంగ్లాదేశ్‌తో జరుగనున్న ఏకైక టెస్టులో రవీంద్ర జడేజా మెరుగ్గా రాణించగలిగితే ఉత్తమ టెస్టు బౌలర్ల జాబితాలో అతను అశ్విన్‌ను కిందికి నెట్టి అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది.
ఈ మ్యాచ్‌లో ఆడనున్న ఉత్తమ ర్యాంకు బౌలర్లలో అశ్విన్, జడేజాల తర్వాత బంగ్లాదేశ్ ఆటగాడు షకీబ్ అల్ హసన్ (ఐసిసి ర్యాంకింగ్స్‌లో 14వ స్థానం) మూడో వాడు కాగా, టీమిండియా పేసర్ ఇశాంత్ శర్మ (ఐసిసి ర్యాంకింగ్స్‌లో 23వ స్థానం), బంగ్లాదేశ్ ఆటగాడు మెహిదీ హసన్ (ఐసిసి ర్యాంకుల్లో 36వ స్థానం), టీమిండియా పేసర్ ఉమేష్ యాదవ్ (ఐసిసి ర్యాంకుల్లో 37వ స్థానం), బంగ్లాదేశ్ ఆటగాడు తైజుల్ ఇస్లామ్ (ఐసిసి ర్యాంకుల్లో 39వ స్థానం) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఇక ఐసిసి ఉత్తమ బ్యాట్స్‌మన్ల జాబితాలో అగ్రస్థానాన్ని ఆక్రమించిన స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) కంటే 58 పాయింట్లు వెనుకబడి రెండో ర్యాంకులో కొనసాగుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఫామ్‌ను కొనసాగించి బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టులోనూ సత్తా చాటాలని ఎదురుచూస్తున్నాడు. ఇదే గనుక జరిగితే కోహ్లీ రేటింగ్ పాయింట్లు మరింత పెరిగి అతను స్టీవ్ స్మిత్‌కు మరింత చేరువయ్యే అవకాశం ఉంటుంది. ఈ మ్యాచ్‌లో ఆడనునన్న ఉత్తమ ర్యాంకు బ్యాట్స్‌మెన్‌లో కోహ్లీ తర్వాత చటేశ్వర్ పుజారా (12వ ర్యాంకు), అజింక్యా రహానే (15వ ర్యాంకు), షకీబ్ అల్ హసన్ (22వ ర్యాంకు), మురళీ విజయ్ (27వ ర్యాంకు), తమీమ్ ఇక్బాల్ (28వ ర్యాంకు), మొమినుల్ హక్ (29వ ర్యాంకు) ఉన్నారు.
ఇక ప్రపంచంలోని ఉత్తమ టెస్టు జట్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమిండియా 9వ ర్యాంకులో ఉన్న బంగ్లాదేశ్ కంటే 58 పాయింట్లు ముందంజలో ఉంది. కనుక హైదరాబాద్‌లో జరుగనున్న టెస్టులో టీమిండియా విజయం సాధిస్తే మరో పాయింట్‌ను తన ఖాతాలో జమ చేసుకుంటుంది. బంగ్లాదేశ్ ఒక రేటింగ్ పాయింట్‌ను కోల్పోతుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ విజయం సాధిస్తే ఆ జట్టుకు 5 పాయిట్లు లభించి టీమిండియా రేటింగ్ పాయింట్లు 120 నుంచి 118కి తగ్గుతాయి. ఇరు జట్ల ర్యాంకింగ్స్‌లో భారీ వ్యత్యాసమే ఇందుకు కారణం.