క్రీడాభూమి

ఎక్కువ టెస్టులు ఆడితే మా సత్తా చూపిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 8: టెస్టు ఫార్మాట్‌లో తమను తక్కువ చేస్తూ చూపించడం తప్పని, ఎక్కువ టెస్టులు ఆడితే తమ సత్తా ఏమిటో చూపిస్తామని బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్ఫికర్ రహీం వ్యాఖ్యానించాడు. బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరు సమావేశంలో అతను మాట్లాడుతూ తమతో ఏ జట్టూ తరచుగా టెస్టు సిరీస్‌లు ఆడడం లేదని, అంతేగాక ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌లపై ఆసక్తి చూపడం లేదని అన్నాడు. తమకు కూడా ఎక్కువ టెస్టుల్లో ఆడే అవకాశం లభిస్తే, తమను తాము నిరూపించుకుంటామని అన్నాడు. భారత్‌లో టెస్టు ఆడడం అనుకున్నంత సులభం కాదని, తాము చాలా కష్టపడాల్సి ఉంటుందని ముష్ఫికర్ స్పష్టం చేశాడు. అయితే, బలమైన టీమిండియాకు గట్టిపోటీని ఇవ్వడానికి అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని చెప్పాడు. ప్రపంచ మేటి జట్టును, ఆ దేశంలోనే ఢీకొనడం చాలా కష్టమని, అత్యంత క్లిష్టమైన మ్యాచ్‌ని ఆడాల్సి ఉందని సహచరులకు హితవు పలికాడు. భారత్ పిచ్‌ల తీరు ఎంత భిన్నంగా ఉంటయో తనకు తెలుసునని అన్నాడు. ఒక రకంగా తమ ముందు చాలా పెద్ద సవాలు ఉందని అన్నాడు. పటిష్టమైన టీమిండియాతో భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు సర్వశక్తులు ఒడ్డి పోరాడక తప్పదని అన్నాడు. భారత జట్టు శక్తిసామర్థ్యాలు తనకు తెలుసునని, తమ ముందు పెద్ద సవాలు ఉందని అన్నాడు. ఒక ప్రశ్నపై స్పందిస్తూ, వచ్చే ఏడాది తాము మొత్తం 11 టెస్టులు ఆడబోతున్నట్టు చెప్పాడు. వీటిలో ఎక్కువ శాతం విదేశాల్లోనే ఆడతామని అన్నాడు. తాను 11 సంవత్సరాలుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నానని, ఇంత భారీ సంఖ్యలో ఎప్పుడూ వరుస టెస్టులు రాలేదని అన్నాడు. బంగ్లాదేశ్ జట్టు గతంతో పోలిస్తే మెరుగుపడిందా లేదా అన్నది ఏ విధంగా నిర్ణయించుకుంటారని ఒక ప్రశ్నకు సమాధానంగా విలేఖరులను ముష్ఫికర్ నిలదీశాడు. తమ దేశంలో క్రికెట్‌కు విపరీతమైన ఆదరణ ఉందని, అందుకే, ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలని కోరుకుంటున్నామని అన్నాడు. భారత్‌కు గట్టిపోటీ ఇస్తామని ధీమా వ్యక్తం చేశాడు.