క్రీడాభూమి

రహానే శ్రమను విస్మరించడం తప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 8: రహానే సుమారు రెండేళ్ల కష్టాన్ని విస్మరించడం తప్పని, ఒకటిరెండు మ్యాచ్‌లను పరిగణలోకి తీసుకొని అతనిపై విమర్శలు చేయడం తగదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. బంగ్లాదేశ్‌తో టెస్టు మ్యాచ్ గురువారం నుంచి ప్రారంభం కానుండగా, బుధవారం ప్రాక్టీస్ సెషన్ ముగిసిన తర్వాత అతను విలేఖరులతో మాట్లాడుతూ రహానే ఫామ్‌లో లేడని, అతను ఆశించిన స్థాయిలో రాణించడం లేదని వస్తున్న వాదనను తోసిపుచ్చాడు. రహానే గాయపడినప్పుడు, అతని స్థానంలో జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీతో రాణించిన విషయాన్ని కోహ్లీ ప్రస్తావించాడు. నాయర్ చాలా గొప్పగా ఆడాడని, రహానే స్థానాన్ని భర్తీచేయగల సత్తా తనకు ఉందని నిరూపించుకున్నాడని అన్నాడు. అయితే, ఒక మ్యాచ్‌లో నాయర్ ప్రదర్శనను ఆధారంగా చేసుకొని రహానేను తక్కువ అంచనా వేయడం తగదని హితవు పలికాడు. బంగ్లాదేశ్‌తో టెస్టుకు తుది జట్టు కూర్పు ఎలా ఉండబోతుందో చెప్పడానికి అతను నిరాకరించాడు. ఎవరెవరు మ్యాచ్ ఆడతారన్నది అప్పటి పరిస్థితులపై ఆధారపడి ఉంటుందన్నాడు. ఒక ప్రశ్నపై స్పందిస్తూ, జట్టులోని సభ్యులందరికీ తాను ఏం కోరుకుంటున్నానో స్పష్టంగా తెలియచేయడం కెప్టెన్‌గా తన కర్తవ్యమని అన్నాడు. సహచరులకు తాను అలాంటి సమాచార్ని అందించడంలో ఏమాత్రం ఆలస్యం చేయనని చెప్పాడు. నిలకడగా రాణించాలన్నా, ఎక్కువ కాలం కెరీర్ కొనసాగాలన్నా ముందుగా తగినన్ని అవకాశాలు లభించాలని వ్యాఖ్యానించాడు. ఒకటిరెండు మ్యాచ్‌ల ఆధారంగా ఎవరిపైనా ముద్రలు వేయడం తగదని అన్నాడు.