క్రీడాభూమి

ఆసీస్ టి-20 జట్టులో బెన్ డంక్‌కు చోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, ఫిబ్రవరి 9: హార్డ్ హిట్టర్‌గా పేరు సంపాదించిన బిగ్ బాష్ లీగ్ (బిబిఎల్) టాప్ టాపర్ బెన్ డంక్‌కు ఆస్ట్రేలియా టి-20 జట్టులో చోటు దక్కింది. మరో పించ్ హిట్టర్ క్రిస్ లిన్ గాయం కారణంగా శ్రీలంకతో జరిగే టి-20 సిరీస్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో బెన్ డక్‌ను జట్టులోకి తీసుకున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) ప్రకటించింది. ఈ ఏడాది తాను ఆడిన బిబిఎల్ మ్యాచ్‌ల్లో అతను 222 బంతులు ఎదుర్కొన్నాడు. 364 పరుగులు సాధించాడు. కాగా, ఆసీస్, లంక జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌లో భాగంగా మ్యాచ్‌లు 17న మెల్బోర్న్‌లో, 19న గీలాంగ్‌లో, 22న అడెలైడ్‌లో జరుగుతాయి.
షాన్‌కు స్టీవ్ వా ఓటు
భారత్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో ఓపెనర్‌గా మాట్ రెన్షా కంటే షాన్ మార్ష్‌ను దింపడం మంచిదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా అన్నాడు. భారత్ పిచ్‌లపై రెన్షా కంటే షాన్ గొప్పగా రాణించగలడని అభిప్రాయపడ్డాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో ఆడిన అనుభవం ఉంది కాబట్టి, భారత్ వాతావరణం, పిచ్‌ల స్వభావం అతనికి బాగా తెలుసునని అన్నాడు. పైగా అంతర్జాతీయ క్రికెట్‌లో షాన్‌కే ఎక్కువ అనుభవం ఉందన్నాడు.

చిత్రం.. బెన్ డంక్