క్రీడాభూమి

పుజారా రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: చటేశ్వర్ పుజారా ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 83 పరుగులు చేశాడు. ఈ ఫస్ట్‌క్లాస్ సీజన్‌లో అతను మొత్తం 1,605 పరుగులు పరుగులు చేసి, 1964-65 సీజన్‌లో చందూ బోర్డే 1,604 పరుగులతో నెలకొల్పిన రికార్డును బద్దలు చేశాడు. బోర్డే 28 ఇన్నింగ్స్‌లో ఈ స్కోరును చేస్తే, పుజారా 21 ఇన్నింగ్స్‌లోనే అతనిని అధిగమించాడు. ఒక ఫస్ట్ క్లాస్ సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాట్స్‌మెన్ జాబితా ‘టాప్-3’లో చోటు దక్కించుకోవడం పుజారాకు ఇది రెండోసారి. 2012-13 సీజన్‌లో అతను 23 ఇన్నింగ్స్‌లో 1,585 పరుగులు చేశాడు.
* మురళీ విజయ్‌తో కలిసి పుజారా మరోసారి సెంచరీ భాగస్వామ్యాన్ని సాధించాడు. ఈ విధంగా వీరు వందకుపైగా పరుగులను జోడించడం ఇది ఐదోసారి. 1948-49 సీజన్‌లో విజయ్ హజారే, రూసీ మోడీ నాలుగు సెంచరీ భాగస్వామ్యాలను సాధించగా, ఆ రికార్డును పుజారా, విజయ్ అధిగమించారు.
* చటేశ్వర్ పుజారాతో కలిసి మురళీ విజయ్ రెండో వికెట్‌కు 154 పరుగులు జోడించాడు. ఇదే స్టేడియంలో, 2013 మార్చిలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో వీరిద్దరూ రెండో వికెట్‌కు 370 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.
* మురళీ విజయ్ కెరీర్‌లో తొమ్మిదో సెంచరీ చేసి, ఎక్కువ శతకాలు సాధించిన భారత ఓపెనర్ల జాబితాలో మూడో స్థానాన్ని సంపాదించాడు. ఓపెనర్లుగా విజయ్ కంటే సునీల్ గవాస్కర్ (33), వీరేందర్ సెవాగ్ (22) మాత్రమే ఎక్కువ సెంచరీలు చేశారు.

చిత్రం..చటేశ్వర్ పుజారా