క్రీడాభూమి

విజయ్ విజృంభణ కోహ్లీ అజేయ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 9: ఓపెనర్ మురళీ విజయ్ విజృంభణ కొనసాగితే, కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి విశ్వరూపాన్ని ప్రదర్శించడంతో, బంగ్లాదేశ్‌తో గురువారం మొదలైన ఏకైక టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మూడు వికెట్లకు 356 పరుగులు సాధించి, భారీ స్కోరు దిశగా సాగుతున్నది. ఓపెనర్ విజయ్ కెరీర్‌లో తొమ్మిదో టెస్టు సెంచరీని సాధిస్తే, 15వ టెస్టు శతకాన్ని పూర్తి చేసిన కోహ్లీ నాటౌట్‌గా ఉన్నాడు. దీనితో రెండోరోజు ఆటలోనూ బంగ్లాదేశ్ బౌలింగ్‌పై భారత్ బ్యాటింగ్ ఆధిపత్యం కొనసాగడం ఖాయంగా కనిపిస్తున్నది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ మొదటి ఓవర్‌లోనే వికెట్ కోల్పోయింది. నాలుగు బంతులు ఎదుర్కొని, రెండు పరుగులు చేసిన లోకేష్ రాహుల్‌ను తస్కిన్ అహ్మద్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే, ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన చటేశ్వర్ పుజారాతో కలిసి ఓపెనర్ విజయ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. బంగ్లాదేశ్ బౌలింగ్‌లో ఏమాత్రం లక్ష్య పెట్టకుండా ఆడిన వీరు రెండో వికెట్‌కు 178 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. క్రీజ్‌లో పాతుకుపోయి, 177 బంతుల్లో, తొమ్మిది ఫోర్ల సాయంతో 83 పరుగులు చేసిన అతను మెహదీ హసన్ మీర్జా బౌలింగ్‌లో బంతి స్నిక్ కావడంతో వికెట్‌కీపర్ ముష్ఫికర్ రహీంకు దొరికిపోయాడు. రక్షణాత్మక ఆటకు ప్రాధాన్యం ఇచ్చిన అతను ‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్‌ను తలపించాడు. సెకండ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ కోహ్లీ మద్దతుతూ విజయ్ శతకాన్ని పూర్తి చేశాడు. 160 బంతులు ఎదుర్కొని, 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 108 పరుగులు చేసిన అతను తైజుల్ ఇస్లాం బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. విజయ్, కోహ్లీ భాగస్వామ్యంలో, మూడో వికెట్‌కు 154 పరుగులు జత కలిశాయి. కాగా, విజయ్ అవుట్‌కావడంతో క్రీజ్‌లోకి వచ్చిన ఆజింక్య రహానే కూడా బంగ్లాదేశ్ బౌలింగ్‌ను ఎదురునిలిచాడు. మరోవైపు కోహ్లీ కెరీర్‌లో శతకాన్ని పూర్తి చేశాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి వీరిద్దరూ నాలుగో వికెట్‌కు అభేద్యంగా 122 పరుగులు జోడించారు. కోహ్లీ 141 బంతులు ఎదుర్కొని 111 (12 ఫోర్లు), రహానే 60 బంతులు ఎదుర్కొని 45 (7 ఫోర్లు) పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నారు. ఇప్పటికే 356 పరుగులు చేసిన భారత్, రెండో రోజు మరింతగా విజృంభించి, భారీ స్కోరు సాధించే అవకాశాలున్నాయి. ఆతర్వా త బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచి, మ్యాచ్‌ని తన ఖాతాలో వేసుకోవడమే టీమిండియా కెప్టెన్ కోహ్లీ ఆలోచ నగా కనిపిస్తున్నది.
**

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏడో జట్టుపైనా సెంచరీ నమోదు చేశాడు. అతను ఇప్పటి వరకూ ఏడు జట్లతో టెస్టులు ఆడితే, అన్నిటిపైనా సెంచరీలు సాధించడం విశేషం. పాకిస్తాన్, జింబాబ్వే జట్లతో టెస్టు మ్యాచ్ ఆడే అవకాశం అతనికి ఇంకా రాలేదు. కాగా, నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగినప్పుడు కోహ్లీ సెంచరీ చేయడం ఇది పనె్నండోసారి. ఈ స్థానంలో సచిన్ తెండూల్కర్ ఒక్కడే కోహ్లీ కంటే ఎక్కువ సెంచరీ చేశాడు. సచిన్ నంబర్ ఫోర్‌గా బ్యాటింగ్‌కు దిగినప్పుడు చేసిన శతకాలు 44. తర్వాతి స్థానాన్ని గుండప్ప విశ్వనాథ్ (12 సెంచరీలు)తో కలిసి కోహ్లీ పంచుకుంటున్నాడు.
భారత జట్టు కెప్టెన్‌గా కోహ్లీకి ఇది తొమ్మిదో శతకం. మహమ్మద్ అజరుద్దీన్ కూడా భారత సారథిగా ఇనే్న శతకాలు చేశాడు. వీరిద్దరూ సంయుక్తంగా రెండో స్థానంలో ఉండగా, మొదటి స్థానాన్ని సునీల్ ఆక్రమించాడు. కెప్టెన్‌గా కొనసాగిన కాలంలో అతను 11 సెంచరీలు సాధించాడు. అయితే, సగటుల్లో మాత్రం కోహ్లీదే అగ్రస్థానం. కెప్టెన్‌గా అతను సగటున 67.33 పరుగులు చేశాడు.

స్కోరుబోర్డు

భారత్ తొలి ఇన్నింగ్స్: లోకేష్ రాహుల్ బి తస్కిన్ అహ్మద్ 2, మురళీ విజయ్ బి తైజుల్ ఇస్లాం 108, చటేశ్వర్ పుజారా సి ముష్ఫికర్ రహీం బి మెహదీ హసన్ మీర్జా 83, విరాట్ కోహ్లీ 111 నాటౌట్, ఆజింక్య రహానే 45 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 7, మొత్తం (90 ఓవర్లలో 3 వికెట్లకు) 356.
వికెట్ల పతనం: 1-2, 2-180, 3-234.
బౌలింగ్: తస్కిన్ అహ్మద్ 16-2-58-1, కమ్రుల్ ఇస్లాం రబ్బీ 17-1-91-0, సౌమ్య సర్కార్ 1-0-4-0, మెహదీ హసన్ మీర్జా 20-0-93-1, షకీబ్ అల్ హసన్ 13-3-45-0, తైజుల్ ఇస్లాం 20-4-50-1, సబ్బీర్ రహ్మాన్ 3-0-10-0.

చిత్రం..సెంచరీ హీరోలు మురళీ విజయ్, విరాట్ కోహ్లీ