క్రీడాభూమి

కెప్టెన్లంతా ఒకవైపు.. కోహ్లీ ఒకవైపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: భారత టెస్టు జట్టుకు కోహ్లీ 32వ కెప్టెన్. టీమిండియా కెప్టెన్‌గా మొదటిసారి టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన ఘనత మన్సూర్ అలీఖాన్ పటౌడీది. అతను 1964లో ఇంగ్లాండ్‌పై 203 పరుగులు సాధించాడు. ఆతర్వాత సునీల్ గవాస్కర్ 1978లో వెస్టిండీస్‌పై ముంబయి టెస్టులో 205, సచిన్ తెండూల్కర్ 1999లో న్యూజిలాండ్‌పై అహ్మదాబాద్‌లో 217, మహేంద్ర సింగ్ ధోనీ 2013లో ఆస్ట్రేలియాపై చెన్నైలో 224 చొప్పున పరుగులు చేశారు. మొత్తం మీద 31 మంది కెప్టెన్లలో కేవలం నలుగురు మాత్రమే, అదీ తలా ఒక్కొక్కటి చొప్పున డబుల్ సెంచరీలు చేస్తే, కోహ్లీ ఒక్కడే నాలుగు డబుల్ సెంచరీలు సాధించాడు. అతని ఫామ్ ఏ స్థాయిలో కొనసాగుతున్నదో చెప్పడానికి ఇదో ఉదాహరణ.
* బంగ్లాదేశ్‌పై డబుల్ సెంచరీ సాధించిన కెప్టెన్లలో స్టెఫెన్ ఫ్లెమింగ్ (న్యూజిలాండ్/ 2004లో/ 202), గ్రేమ్ స్మిత్ (దక్షిణాఫ్రికా/ 2008లో/ 232) తర్వాత మూడో వాడిగా కోహ్లీ రికారుకెక్కాడు.
* హోం సీజన్‌లో వీరేందర్ సెవాగ్ 2004-2005లో 1,105 పరుగులతో నెలకొల్పిన అత్యధిక పరుగుల రికార్డును కోహ్లీ బద్దలు చేశాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అవుటయ్యే సమయానికి ఈ హోం సీజన్‌లో అతని ఖాతాలో 1,168 పరుగులు చేరాయి. సెవాగ్ 17 ఇన్నింగ్స్‌లో నెలకొల్పిన రికార్డును కోహ్లీ 15వ ఇన్నింగ్స్‌లోనే అధిగమించడం గమనార్హం. అంతేగాక, సెవాగ్ సటు 69.06 కాగా, కోహ్లీ సగటు 89.84 పరుగులు.
* కోహ్లీ 180 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మెహదీ హసన్ మీర్జా వేసిన బంతి వేగంగా దూసుకొచ్చి అతని ప్యాడ్స్‌కు తగిలింది. బౌలర్ అప్పీల్ చేయడంతో, కోహ్లీని ఫీల్డ్ అంపైర్ ఎల్‌బిగా ప్రకటించాడు. అయితే, నాన్‌స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న వృద్ధిమాన్ సాహాతో సంప్రదించిన తర్వాత, అంపైర్ నిర్ణయాన్ని సవాలు చేశాడు. డిఆర్‌ఎస్ అతనికి అనుకూలంగా వచ్చింది. బంతి దిశ స్టంప్స్ నుంచి దూరంగా వెళుతున్నట్టు థర్డ్ అంపైర్ ప్రకటించడంతో ఊపిరి తీసుకున్న కోహ్లీ డబుల్ సెంచరీని పూర్తి చేశాడు. ఆ ఒక్క సంఘటనను మినహాయిస్తే, బంగ్లాదేశ్ బౌలింగ్‌కు అతను బీటైన సందర్భాలు లేవు.
భారత టెస్టు చరిత్రలో ఎక్కువ డబుల్ సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్‌లో కోహ్లీ నాలుగోవాడు. సచిన్ తెండూల్కర్, వీరేందర్ సెవాగ్ తమతమ కెరీర్‌లో ఆరేసి డబుల్ సెంచరీలు చేశాడు. రాహుల్ ద్రవిడ్ ఐదు డబుల్ సెంచరీలు చేశాడు. సునీల్ గవాస్కర్‌తో సమానంగా నాలగు డబుల్ సెంచరీలు సాధించాడు. వినోద్ కాంబ్లీ, దిలీప్ సర్దేశాయ్, వసీం జాఫర్, వినూ మన్కడ్, చటేశ్వర్ పుజారా తలా రెండేసి సార్లు డబుల్ సెంచరీలతో రాణించారు.