క్రీడాభూమి

50 సెంచరీల క్లబ్‌లో ఆమ్లాకు చోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెంచూరియన్: కనీసం 50 అంతర్జాతీయ శతకాలు సాధించిన బ్యాట్స్‌మెన్ జాబితాలో దక్షిణాఫ్రికా ఓపెనర్ హషీం ఆమ్లాకు స్థానం దక్కింది. శ్రీలంకతో జరిగిన చివరి వనే్డలో చేసిన సెంచరీ అతనికి అన్ని ఫార్మాట్స్‌లో కలిపి 50వ శతకం. కనీసం 50 లేదా అంతకు మించి అంతర్జాతీయ శతకాలను నమోదు చేసిన ఏడో బ్యాట్స్‌మన్‌గా అతను చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. ఇలావుంటే, ఆమ్లా 12వ వనే్డ శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. తక్కువ ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని చేరిన రెండో బ్యాట్స్‌మన్‌గా అతను గుర్తింపు సంపాదించాడు. అతని సహచరుడు క్వింటన్ డికాక్ 74 ఇన్నింగ్స్‌లోనే 12వ శతకాన్ని నమోదు చేసి, అగ్రస్థానంలో ఉన్నాడు.

చిత్రం.. హషీం ఆమ్లా