క్రీడాభూమి

దక్షిణాఫ్రికా క్లీన్‌స్వీప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెంచూరియన్, ఫిబ్రవరి 11: శ్రీలంకతో జరిగిన చివరి, ఐదో వనే్డ ఇంటర్నేషనల్‌ను దక్షిణాఫ్రికా 88 పరుగుల తేడాతో గెల్చుకుంది. ప్రత్యర్థి నిర్దేశించిన 385 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన లంకకు వైట్‌వాష్ తప్పలేదు. చివరి వనే్డలో టాస్ గెలిచిన లంక ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాకు ఓపెనర్లు క్వింటన్ డికాక్, హషీం ఆమ్లా చక్కటి ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరూ శతకాలను నమోదు చేయడం విశేషం. మొదటి వికెట్‌కు 187 పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన తర్వాత సురంగ లక్మల్ బౌలింగ్‌లో సన్దున్ వీరకొడి క్యాచ్ పట్టగా డికాక్ పెవిలియన్ చేరాడు. అతను 87 బంతులు ఎదుర్కొని, 16 ఫోర్లతో 109 పరుగులు సాధించాడు. ఫఫ్ డు ప్లెసిస్ 41 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద లాహిరు మదుశంక బౌలింగ్‌లో సురంగ లక్మల్‌కు చిక్కాడు. కెప్టెన్ ఎబి డివిలియర్స్ (14), జెపి డుమినీ (10) ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయారు. వికెట్లు కూలుతున్నా, లంక బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కున్న ఆమ్లా ఐదో బ్యాట్స్‌మన్‌గా పెవిలియన్ చేరాడు. అతను 134 బంతులు ఎదుర్కొని 154 పరుగులు సాధించాడు. ఈ స్కోరులో 15 ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. ఫర్హాన్ బెహర్డియన్ 20 బంతుల్లో 32 పరుగులు చేసి, సురంగ లక్మల్ బౌలింగ్‌లోనే అసెల గుణరత్నేకు దొరికాడు. దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 384 పరుగులు సాధించగా, క్రిస్ మోరిస్ (3), వేన్ పార్నెల్ (1) నాటౌట్‌గా నిలిచారు.
గుణరత్నే శతకం వృథా
భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక బ్యాట్స్‌మెన్ తీవ్రమైన ఒత్తిడికి గురయ్యారు. ఫలితంగా ఒకరి తర్వాత మరొకరిగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. మిడిల్ ఆర్డర్‌లో అసెల గుణరత్నే వీరోచితంగా పోరాడి, సెంచరీతో నాటౌట్‌గా నిలిచాడు. సచిత్ పతిరాన 56 పరుగులు చేశాడు. వీరిద్దరూ పోరాడినప్పటికీ, మిగతా వారి నుంచి సరైన సహకారం లభించలేదు. రన్‌రేట్‌పై దృష్టి పెట్టకుండా ఆడడంతో లంక 50 ఓవర్లలో 8 వికెట్లకు 296 పరుగులకు పరిమితమైంది. దక్షిణాఫ్రికా బౌలర్ క్రిస్ మోరిస్ 31 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టాడు. హషీం ఆమ్లాకు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుకు ఫఫ్ డుప్లెసిస్ ఎంపికయ్యాడు.

సంక్షిప్త స్కోర్లు
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: 50 ఓవర్లలో 6 వికెట్లకు 384 (క్వింటన్ డికాక్ 109, హషీం ఆమ్లా 154, సురంగ లక్మల్ 3/71, లాహిరు మదుశంక 2/70).
శ్రీలంక ఇన్నింగ్స్: 50 ఓవర్లలో 8 వికెట్లకు 296 (నిరోషన్ డిక్‌విల్లా 39, అసెల గుణరత్నే 114 నాటౌట్, సచిన్ పతిరాన 56, క్రిస్ మోరిస్ 4/31, వేన్ పార్నెల్ 2/51).