క్రీడాభూమి

వనే్డ ర్యాంకింగ్స్‌లో ప్రిటోరియా నంబర్ వన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెంచూరియన్: ప్రపంచ వనే్డ ర్యాంకింగ్స్‌లో దక్షిణాఫ్రికా నంబర్ వన్ స్థానానికి దూసుకెళ్లింది. శ్రీలంకతో జరిగిన చివరి వనే్డను గెల్చుకొని, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఈ జట్టు మొత్తం 119 ర్యాంకింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఇంత వరకూ అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా 118 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది. న్యూజిలాండ్ 113 పాయింట్లతో మూడో స్థానంలో నిలవగా, భారత్ 112 పాయింట్లు సంపాదించి నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ‘టాప్-10’లో ఐదు నుంచి పది వరకూ వరుసగా ఇంగ్లాండ్ (107 పాయింట్లు), శ్రీలంక (98), బంగ్లాదేశ్ (91), పాకిస్తాన్ (89), వెస్టిండీస్ (86), అఫ్గానిస్తాన్ (52 పాయింట్లు) జట్లు ఉన్నాయి. టెస్టు హోదా ఉన్న జింబాబ్వే 48 రేటింగ్ పాయింట్లతో, అఫ్గానిస్థాన్ కంటే దిగువన 11వ స్థానంతో నిలవడం గమనార్హం.