క్రీడాభూమి

అంగోలా స్టేడియంలో తొక్కిసలాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉల్జే (అంగోలా), ఫిబ్రవరి 11: అంగోలాలోని ఉల్జే పట్టణ స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 17 మంది మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి ఆందోళనకనంగా ఉంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఉల్జేలో శాంటి రిటా డి కాసియా, రిక్రియాటివో డి లిబొలో ఫుట్‌బాల్ జట్లు తలపడ్డాయి. ఈ మైదానంలో ఇదే తొలి లీగ్ మ్యాచ్ కావడంతో, అభిమానులు టికెట్ల కోసం పోటీపడ్డారు. 8,000 మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా మ్యాచ్‌ని చూసే అవకాశం ఉండగా, కనీరం మూడునాలుగు రెట్లు ఎక్కువగా అభిమానులు స్టేడియానికి వచ్చారు. మ్యాచ్ మొదలు కావడంతో, టికెట్ దొరకని వారు గోడలు, గేట్లు దూకి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. దీనితో గందరగోళ పరిస్థితి నెలకొని, చివరికి తొక్కిసలాటకు దారితీసింది. ఈ సంఘటనలో 17 మంది మృతి చెందారని అధికారులు అంటుండగా, ఈ సంఖ్య ఇంకా చాలా ఎక్కువేనని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. నూటయాభై మందికిపైగా క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారిలో చాలా మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు.

చిత్రం..స్టేడియం ముందు గుమికూడిన జనం