క్రీడాభూమి

ముర్రేకు ఘన స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఫిబ్రవరి 2: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ఫైనల్‌లో ప్రపంచ నంబర్ వన్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ చేతిలో ఓడిన బ్రిటన్ స్టార్, రెండో ర్యాంకర్ ఆండీ ముర్రేకు లండన్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. పలువురు అధికారులు పుష్పగుచ్ఛాలను అందించి అతనికి స్వాగతం పలికారు. విమానాశ్రయం వెలుపల వేలాదిమంది మంది అభిమానులు అతని కోసం నిరీక్షించారు. అందరికీ అభివాదం చేస్తూ ముర్రే తన ఇంటికి వెళ్లిపోయాడు. ఐదుసార్లు ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్ చేరిన అతను ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేకపోవడం గమనార్హం.

హాకీ ఇండియా లీగ్
ఢిల్లీకి పంజాబ్ షాక్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ వేవ్‌రైడర్స్‌కు పంజాబ్ వారియర్స్ జట్టు షాకిచ్చింది. ఎవరూ ఊహించని విధంగా 5-2 తేడాతో విజయం సాధించింది. మార్క్ గ్లెగోర్ (10వ నిమిషం), మార్క్ నోల్స్ (11వ నిమిషం), క్రిస్ట్ఫోర్ సిరియెల్లో (22వ నిమిషం), జేక్ వెటాన్ (37వ నిమిషం) పంజాబ్‌కు గోల్స్‌ను అందించారు. ఈ జట్టు ఒక ఫీల్డ్ గోల్‌ను సాధించి ఒక బోనస్ గోల్‌ను కూడా పొందింది. దీనితో ఆ జట్టుకు ఐదు గోల్స్ లభించాయి. ఢిల్లీ జట్టుకు రూపీందర్ పాల్ సింగ్ 35, 55 నిమిషాల్లో గోల్స్ అందించాడు. మిగతా ఆటగాళ్ల వైఫల్యం ఢిల్లీని ఓటమిపాలు చేసింది.

జిబ్రాల్టర్ ఇంటర్నేషనల్ చెస్
ఆనంద్‌కు మరో ఓటమి

జిబ్రాల్టర్, ఫిబ్రవరి 2: ప్రపంచ మాజీ చాంపియన్, భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌ను మరో ఓటమి వెక్కిరించింది. జిబ్రాల్టర్ చెస్ ఏడో రౌండ్‌లో 16 ఏళ్ల అంతర్జాతీయ మాస్టర్ బెంజమిన్ గ్లెడురాను ఢీకొన్న అతను పావులను సమర్థంగా ముందుకు నడిపించలేకపోయాడు. పదేపదే పొరపాట్లు చేస్తూ చివరికి గేమ్‌ను ప్రత్యర్థికి సమర్పించుకున్నాడు.

మా ఆత్మవిశ్వాసం పెరిగింది: రైనా
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: ఆస్ట్రేలియాతో జరిగిన టి-20 సిరీస్‌ను 3-0 తేడాతో గెల్చుకోవడంతో టీమిండియా ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ సురేష్ రైనా అన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో కొత్తగా అడుగుపెట్టిన గుజరాత్ లయన్స్ జట్టుకు నాయకత్వం వహించనున్న అతను మంగళవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో జట్టు లోగోను విడుదల చేశాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ ఆస్ట్రేలియా జట్టును ఆస్ట్రేలియాలోనే ఓడించడం అనుకున్నంత సులభం కాదని వ్యాఖ్యానించాడు. స్టీవెన్ స్మిత్, డేవిడ్ వార్నర్, జేమ్స్ ఫాల్క్‌నెర్ వంటి మేటి ఆటగాళ్లు మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కేవలం ఒకే మ్యాచ్ ఆడారని, ద్వితీయ శ్రేణి క్రికెటర్లతోనే భారత్ తలపడిందని వచ్చిన వార్తలను రైనా తోసిపుచ్చాడు. జట్టు ఏ స్థాయిదన్నది కీలకం కాదన్నాడు. విజయాలు ఆనందాన్ని పెంచుతాయని అన్నాడు. అదే విధంగా ఆత్మవిశ్వానాన్ని అందిస్తాయని పేర్కొన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఎనిమిది సీజన్లు మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆర్డర్‌లో మార్పులు లాభదాయకమేనని చెప్పాడు. టి-20 ప్రపంచ కప్‌లో భారత్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టి-20లో అజేయంగా 49 పరుగులు సాధించిన రైనా తెలిపాడు. ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో తాను, యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్‌కు దిగుతామని, దీనితో మిడిల్ ఆర్డర్ బలోపేతంగా కనిపిస్తున్నదని అన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టి-20 సిరీస్ ఫలితం టీమిండియా క్రికెటర్లలో ఉత్సాహాన్ని పెంచిందని తెలిపాడు. టి-20 వరల్డ్ కప్‌లో టైటిల్ సాధించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తామని అన్నాడు.