క్రీడాభూమి

అశ్విన్ ‘్ఫస్టెస్ట్ 250’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా 250 వికెట్ల మైలురాయిని చేరిన బౌలర్‌గా భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రికార్డు సృష్టించాడు. కెరీర్‌లో 45వ టెస్టు ఆడుతున్న అతను బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్ ఆదివారం నాటి ఆటలో ముష్ఫికర్ రహీంను అవుట్ చేశాడు. ఇది అతనికి 250 వికెట్. ఇంతకు ముందు 48 టెస్టుల్లో 250 వికెట్లు సాధించిన ఆస్ట్రేలియా మాజీ పేసర్ డెన్నిస్ లిల్లీ రికార్డును అశ్విన్ బద్దలు చేశాడు. 2016లో 8 టెస్టులు ఆడి 55 వికెట్లు పడగొట్టిన అతను మరోసారి ఫామ్‌లోకి వచ్చాడు. ఇలావుంటే, 45 టెస్టులు ముగిసే సమయానికి ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలోకి దూసుకొచ్చిన అశ్విన్ ఇంత వరకూ 12,905 బంతులు వేసి, 250 వికెట్లు కూల్చాడు. ఇనే్న మ్యాచ్‌ల్లో డేల్ స్టెయిన్ 9,221 బంతులు వేసి 232, డెన్నిస్ లిల్లీ 11,887 బంతులు వేసి, 9,191 బంతులు వేసి 227, అలాన్ డొనాల్డ్ 10,370 బంతులు బౌల్ చేసి 223 చొప్పున వికెట్లు సాధించారు. కాగా, రంగన హెరాత్ 46 మ్యాచ్‌ల్లో 247 వికెట్లు పడగొట్టగా ఆ మైలు రాయకి అశ్విన్ చేరువయ్యాడు.