క్రీడాభూమి

ఎస్‌జి బాల్స్‌తో స్వింగ్ సులభమే: స్టార్క్ ధీమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, ఫిబ్రవరి 12: ఎస్‌జి బంతులతో స్వింగ్ సులభమేనని, భారత్ పర్యటనలో తనకు ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది తలత్తెదని ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌల్ మిచెల్ స్టార్క్ ధీమా వ్యక్తం చేశాడు. భారత్‌లో పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయన్న వార్తలను అతను ప్రస్తావిస్తూ, బంతిని స్వింగ్ చేయడం ద్వారా మంచి ఫలితాలు రాబట్టవచ్చని ఇక్కడి ఐసిసి గ్లోబల్ అకాడెమీలో ప్రాక్టీస్ మ్యాచ్‌లో పాల్గొన్న స్టార్క్ అన్నాడు. భారత్‌లో టెస్టుల్లో ఎస్‌జి బంతులు వాడతారని, ఆస్ట్రేలియాలో కూకబూర బంతులను ఉపయోగిస్తారని అతను గుర్తుచేశాడు. ఎస్‌జి బంతుల వల్ల వేగం తగ్గినా, స్వింగ్ సాధ్యమవుతుందని అన్నాడు. తక్కువ నిడివిగల స్పెల్స్‌లో తన సేవలను జట్టు మేనేజ్‌మెంట్ వినియోగించుకుంటే బాగుంటుందని సూచించాడు. భారత్‌లో టీమిండియాను ఎదుర్కోడం కష్టమైనప్పటికీ, అసాధ్యం మాత్రం కాదని వ్యాఖ్యానించాడు.