క్రీడాభూమి

అంధుల టి-20 క్రికెట్ విశ్వవిజేత భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంధుల క్రికెట్‌లో భారత్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. 2012లో జరిగిన మొదటి టి-20 వరల్డ్ కప్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఓడించి టైటిల్ సాధించిన భారత్ మరోసారి విజేతగా నిలిచింది. బెంగళూరులో ఆదివారం జరిగిన ఫైనల్‌లో పాక్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుచేసి టైటిల్‌ను నిలబెట్టుకుంది. బ్యాటింగ్ బలంతోనే అన్ని మ్యాచ్‌లను తన ఖాతాలో వేసుకుంటూ వచ్చిన భారత్ ఫైనల్‌లోనూ తన ఆధిపత్యాన్ని నిరూపించింది. రెండేళ్ల క్రితం 50 ఓవర్ల ఫార్మాట్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్‌ను గెల్చుకున్న భారత్, టి-20 ఫార్మాట్‌లోనూ కప్‌ను కైవసం చేసుకుంది. 2014లో జరిగిన అంధుల వనే్డ ప్రపంచకప్ చాంపియన్‌షిప్‌లో పాకిస్తాన్‌ను ఫైనల్‌లో ఓడించిన భారత్ విజేతగా నిలిచింది. అంతకు ముందు మూడు పర్యాయాలు విశ్వవిజేతగా ఉన్న పాక్ దూకుడుకు బ్రేక్ వేసిన భారత జట్టుకు ఆతర్వాత వెనక్కు తిరిగి చూసుకునే అవసరం రాలేదు. వరుస విజయాలతో సత్తా చాటుతున్నది.

**
బెంగళూరు, ఫిబ్రవరి 12: అంధుల టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌ను భారత్ మరోసారి తన ఖాతాలో వేసుకుంది. చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్‌లో ఈ జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తచేసింది. 2012లో మొదటిసారి ఈ టోర్నీని ప్రవేశపెట్టినప్పుడు, ఫైనల్‌ను పాకిస్తాన్‌పైనే నెగ్గిన భారత్ ఈసారి కూడా అదే ప్రత్యర్థిని ఓడించి టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 197 పరుగులు చేయగా, భారత్ కేవలం ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పాక్ ఇన్నింగ్స్‌లో ఓపెర్ బదార్ మునీర్ (57) అర్ధ శతకాన్ని సాధించగా, మిగతా వారు ఆ స్థాయిలో రాణించలేకపోయారు. భారత బౌలర్లలో కేతన్ పటేల్, మహమ్మద్ జాఫ్ ఇక్బాల్ చెరి రెండు వికెట్లు కూల్చారు.
ఓవర్‌కు సుమారు పది పరుగులు సాధించాల్సిన స్థితిలో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు ప్రకాశ జయరమలా, అజయ్ కుమార్ రెడ్డి చక్కటి ఆరంభాన్నిచ్చారు. మొదటి వికెట్‌కు 110 పరుగులు జోడించిన అజయ్ 43 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద రనౌటయ్యాడు. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కేతన్ పటేల్ 13 బంతుల్లో 26 పరుగులు సాధించి, రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని విడిచిపెట్టాడు. తనంతరం దున్నా వెంకటేష్ (11 నాటౌట్)తో కలిసి ప్రకాశ 17.4 ఓవర్లలోనే భారత్‌కు విజయాన్ని అందించాడు. అతను 60 బంతులు ఎదుర్కొని, 15 ఫోర్లతో అజేయంగా 99 పరుగులు చేశాడు.
సంక్షిప్త స్కోర్లు
పాకిస్తాన్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 8 వికెట్లకు 197 (బదార్ మునీర్ 57, మహమ్మద్ జమీల్ 24, అమీర్ ఇష్ఫక్ 20, కేతన్ పటేల్ 2/29, మహమ్మద్ జాఫర్ ఇక్బాల్ 2/33).
భారత్ ఇన్నింగ్స్: 17.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 200 (ప్రకాశ జయరమలా 99 నాటౌట్, అజయ్ కుమార్ రెడ్డి 43).

అంధుల టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు విజయోత్సాహం