క్రీడాభూమి

వెస్ట్‌ను గెలిపించిన పార్థీవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 13: ముస్తాక్ అలీ ట్రోఫీ టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా సోమవారం నార్త్‌జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ధ శతకం సాధించిన పార్థీవ్ పటేల్ వెస్ట్‌జోన్‌ను గెలిపించాడు. నార్త్ స్టార్ బ్యాట్స్‌మన్ గౌతం గంభీర్ హాఫ్ సెంచరీ సాధించినప్పటికీ ఫలితం లేకపోయింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన నార్త్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 107 పరుగలు చేసింది. గంభీర్ 58 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 60 పరుగులు సాధించాడు. చివరిలో ప్రదీప్ సంగ్లాన్ (10) తప్ప మిగతా వారు సింగిల్ డిజిట్లకే పరిమితమయ్యారు. వెస్ట్ బౌలర్లలో ఇర్ఫాన్ పఠాన్ నాలుగు ఓవర్లు బౌల్ చేసి, 10 పరుగులిచ్చి మూడు వికెట్లు కూల్చాడు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్ట్ 12.4 ఓవర్లలో, రెండు వికెట్లకు 108 పరుగులు సాధించి, ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. కెప్టెన్, వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ పార్థీవ్ పటేల్ 35 బంతుల్లో 56 పరుగులు చేసి, వెస్ట్ జోన్ విజయాన్ని సులభతరం చేశాడు. అతని స్కోరులో తొమ్మిది ఫోర్లు ఉన్నాయి. మరో ఓపెనర్ శ్రేయాస్ అయ్యర్ 30 పరుగులు చేశాడు. ఆతిద్య తారే (14), అంకిత్ బావ్నే (4) నాటౌట్‌గా నిలిచి, జట్టుకు విజయాన్ని అందించారు.
సెంట్రల్ ఓటమి
ఈస్ట్‌జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంట్రల్ జోన్ ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఈ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 151 పరుగలు చేసింది. నమన్ ఓఝా 51, హర్‌ప్రీత్ సింగ్ 48 పరుగులతో రాణించారు. అశోక్ దిండా, సయాన్ ఘోష్ చెరి రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఈస్ట్‌జోన్ 17.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇషాన్ కిషన్ 36 బంతుల్లో 67 పరుగులు చేయగా, ఇశాంక్ జగ్గీ అజేయంగా 51 పరుగులు సాధించాడు. వీరిద్దరి ప్రతిభతో ఈస్ట్‌జోన్ ఏడు వికెట్ల ఆధిక్యంతో గెలిచింది.

చిత్రం..పార్థీవ్ పటేల్ (56)